Breaking News
Home / SLIDER / తెలంగాణ నిరుద్యోగ యువతకు శుభవార్త

తెలంగాణ నిరుద్యోగ యువతకు శుభవార్త

తెలంగాణ  రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీలు, పాలిటెక్నిక్‌ కాలేజీల్లో అధ్యాపక పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ త్వరలోనే నోటిఫికేషన్‌ జారీచేయనున్నది. డిగ్రీ లెక్చరర్‌ 491, సాంకేతిక విద్యలో 247 లెక్చరర్‌ పోస్టుల భర్తీకి నియమ నిబంధనలతో కూడిన వివరాలను అధికారులు టీఎస్‌పీఎస్సీకి ఇటీవలే అందజేశారు.

ఈ పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇవ్వగా, ఆర్థిక శాఖ వేర్వేరుగా రెండు జీవోలను జారీ చేసింది. రాష్ట్రంలో మొత్తం 132 ప్రభుత్వ డిగ్రీ కాలేజీలున్నాయి. వీటిల్లో 4,098 పోస్టులుండగా, 1,255 రెగ్యులర్‌,812 కాంట్రాక్ట్‌, 1,940 గెస్ట్‌ లెక్చరర్లు పనిచేస్తున్నారు.

రెగ్యులర్‌ పోస్టులను 2012లో భర్తీచేశారు. తాజాగా పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతినివ్వడంతో లెక్చరర్ల కొరత తీరనున్నది. ఇటీవలి కాలంలో పలు కొత్త కోర్సులు అందుబాటులోకి వస్తున్నాయి. ఎంసెట్‌లో సీట్లు రాని విద్యార్థులు డిగ్రీలో కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ అప్లికేషన్స్‌ కోర్సును ఎంచుకొంటున్నారు.

ఈ కోర్సును 129 కాలేజీల్లో నిర్వహిస్తున్నారు. కానీ బోధించేందుకు 50 మంది లెక్చరర్స్‌ మాత్రమే ఉన్నారు. కొత్తగా ప్రవేశపెట్టిన పలు కోర్సులు, సబ్జెక్టుల్లో ఇదే పరిస్థితి నెలకొన్నది. కాగా, డిగ్రీ లెక్చరర్ల పోస్టులకు నెట్‌, సెట్‌ లేదా పీహెచ్‌డీ అర్హతను తప్పనిసరిచేశారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino