రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడా లంచాలకు అవకాశం లేకుండా నేరుగా లబ్ధిదారులకు మేలు జరిగిందని ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. సంక్షేమ పథకాల ద్వారా 35 నెలల కాలంలో రూ.1,36,694 కోట్లు ప్రజల చేతుల్లో పెట్టామని చెప్పారు. ఒంగోలులో ‘వైఎస్‌ఆర్ సున్నా వడ్డీ’ నిధులు విడుదల చేసిన అనంతరం నిర్వహించిన సభలో సీఎం మాట్లాడారు. ఈ సందర్భంగా చంద్రబాబు సహా ఎల్లో మీడియాపై తీవ్రస్థాయిలో …
Read More »అనిల్‌తో నాకు ఎలాంటి విభేదాలు లేవు: మంత్రి కాకాణి
వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్‌తో మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, మాజీ మంత్రి అనిల్‌కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. ఇటీవల వారిద్దరి మధ్య విభేదాలు తీవ్రస్థాయికి చేరాయనే వార్తల నేపథ్యంలో సీఎం వారితో వేర్వేరుగా సమావేశమయ్యారు. ఈ మధ్యకాలంలో జరిగిన ఘటనలను వారిద్దరూ సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. జగన్‌తో భేటీ అనంతరం మంత్రి కాకాణి మీడియాతో మాట్లాడారు. అనిల్ యాదవ్‌తో తనకు ఎలాంటి విభేదాలు లేవని.. తమ మధ్య …
Read More »వైసీపీ జిల్లా అధ్యక్షులు, రీజినల్ కోఆర్డినేటర్లు వీళ్లే..
వైసీపీ జిల్లా అధ్యక్షులు, రీజినల్ కోఆర్డినేటర్లను ఆ పార్టీ అధ్యక్షుడు, సీఎం జగన్‌మోహన్‌రెడ్డి నియమించారు. ఇటీవల మంత్రి పదవులు దక్కని వారికి పార్టీలో కీలక పదవులు ఇస్తామని జగన్ హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు వారికి అవకాశం కల్పించారు. తొలి నుంచీ పార్టీకి సేవలందించిన వారితో పాటు మరికొందరికి ఇందులో చోటు కల్పించి గౌరవించారు. జిల్లా అధ్యక్షులు రీజినల్ కోఆర్డినేటర్లు
Read More »ఆవేశంలోనే అలా అనేశాను: వైసీపీ ఎమ్మెల్యే బాబూరావు
మంత్రి పదవి విషయంలో మాట్లాడిన మాటలు ఆవేశంతో అన్నవే తప్పించి తన మనసులో నుంచి రాలేదని పాయకరావుపేట వైసీపీ ఎమ్మెల్యే గొల్ల బాబూరావు అన్నారు. ఇటీవల ఏపీ కేబినెట్ విస్తరణలో చోటు దక్కకపోవడంపై ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో పాయకరావుపేటలో నిర్వహించిన మీడియా సమావేశంలో బాబూరావు మాట్లాడారు. మంత్రి పదవి విషయంలో తనకు ఎలాంటి అసంతృప్తి లేదని చెప్పారు. నియోజకవర్గ ప్రజల కోసం …
Read More »సీఎం జగన్ కు షాకిచ్చిన YCP MLA
ఏపీ అధికార వైసీపీకి చెందిన ఎమ్మెల్యే ఆ పార్టీకే గట్టి షాకిచ్చారు. ఇటీవల జరిగిన మంత్రి వర్గ విస్తరణలో తనకు చోటు దక్కకపోవడంతో సదరు ఎమ్మెల్యే ఆధిష్టానంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఆ పార్టీకి చెందిన పాయకరావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే గొల్ల బాబూరావు తనకు మంత్రి పదవి దక్కకపోవడం గురించి మాట్లాడుతూ ఈ బోడి రాజకీయాలు నాకేందుకు..?. నాకు మంత్రి పదవి రాకుండా ఆధిష్టానం దెబ్బకొట్టింది. నేను కూడా …
Read More »అప్పుడు చాలా బాధపడ్డా: మంత్రి రోజా
టీడీపీలో ఉన్నప్పుడే మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తనను కాంగ్రెస్ పార్టీలోకి రమ్మన్నారని మంత్రి ఆర్కే రోజా గుర్తుచేసుకున్నారు. వైఎస్‌ఆర్‌తో కలిసి రాజకీయాల్లో పనిచేయాలని కలగన్నా.. ఆయన అకాల మరణంతో ఆ అవకాశం రాకపోవడంతో చాలా బాధపడ్డానని చెప్పారు. ఆ సమయంలో ఐరన్ లెగ్ అంటూ తనను టీడీపీ వాళ్లు అవహేళన చేశారని గుర్తు చేశారు. వైఎస్‌ఆర్ తనకు దేవుడని.. ఆయన ఆశయాల సాధన కోసం పుట్టిన పార్టీ వైఎస్సార్‌సీపీ అని …
Read More »మంత్రి రోజాకు దిష్టితీసిన భర్త సెల్వమణి
వైకాపా జెండా పట్టుకుని నడిచిన ప్రతి ఒక్కరికీ సీఎం జగన్ న్యాయం చేస్తున్నారని ఏపీ మంత్రి ఆర్కే రోజా అన్నారు. రాష్ట్రంలోని కుల సమీకరణాల ఆధారంగా కేటాయింపులు చేశారని చెప్పారు. సచివాలయంలోని రెండో బ్లాక్‌లో రాష్ట్ర పర్యాటక, యువజన సర్వీసులు, క్రీడల శాఖ మంత్రిగా ఆమె బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా రోజాకు ఆమె భర్త సెల్వమణి గుమ్మడికాయతో దిష్టి తీశారు. అనంతరం రోజా మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్ …
Read More »నేనెప్పుడూ జగన్‌కు విధేయురాలినే: సుచరిత
ఇటీవల మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణలో చోటు దక్కకపోవడంతో అలకబూనిన ఏపీ హోంశాఖ మాజీ మంత్రి మేకతోటి సుచరిత సీఎం జగన్‌మోహన్‌రెడ్డితో భేటీ అయ్యారు. కేబినెట్‌లో చోటు కల్పించలేకపోవడానికి గల కారణాలను సీఎం వివరించడంతో ఆమె మెత్తబడ్డారు. అనంతరం మీడియాతో సుచరిత మాట్లాడారు. దివంగత సీఎం రాజశేఖర్‌రెడ్డి ఆశీస్సులతో రాజకీయాల్లోకి వచ్చినట్లు చెప్పారు. జడ్పీటీసీ నుంచి హోంమంత్రిగా ఎదిగేందుకు జగన్ అవకాశం కల్పించారన్నారు. రెండున్నరేళ్ల తర్వాత కొంతమందిని మారుస్తానని సీఎం ముందే చెప్పారని.. …
Read More »జగన్ ఎవరికీ అన్యాయం చేయరు: పిన్నెల్లి
సీఎం జగన్‌తో తాను మొదటి నుంచి నడిచిన వ్యక్తినని.. వైసీపీ అంటే తమ పార్టీనే అని మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. మంత్రి పదవి రాలేదని తనకు ఎలాంటి అసంతృప్తి లేదని చెప్పారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో కలిసి పిన్నెల్లి సీఎంను కలిశారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ సామాజిక సమీకరణల్లో భాగంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సీఎం జగన్ మంత్రి వర్గంలో భాగస్వామ్యం కల్పించారని చెప్పారు. …
Read More »నాకెలాంటి కోపం లేదు: మాజీ మంత్రి బాలినేని
మంత్రి పదవి విషయంలో తనకెలాంటి కోపం లేదని మాజీ మంత్రి, ఒంగోలు వైసీపీ సీనియర్ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. సీఎం జగన్‌తో భేటీ అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. మంత్రి పదవి అంశంలో తాను రాజీనామా చేస్తున్నట్లు వచ్చిన వార్తలను అప్పుడే ఖండించానని చెప్పారు. జగన్ ఆలోచన మేరకే మంత్రి పదవులు వస్తాయన్నారు. వైఎస్‌రాజశేఖర్‌రెడ్డి కుటుంబానికి తాను తొలి నుంచి విధేయుడినని చెప్పారు. ప్రకాశం జిల్లాలో పార్టీ బాధ్యతలను …
Read More »