ఏపీలోని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం ఓ శుభవార్తను తెలిపింది. ఇందులో భాగంగా రాష్ట్రంలో రైతులు రబీ సీజన్లో పండించిన పప్పు ధాన్యాలు కొనేందుకు వైసీపీ ప్రభుత్వం అంగీకరించింది.దీంతో వచ్చే నెల ఏఫ్రిల్ నుంచి పెసలు, మినుములను మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు చేసింది. ఈ సీజన్లో 1,26,270 టన్నుల శనగలు, 91,475 టన్నుల మినుములు, 19,632 టన్నుల పెసలు కొంటామని తెలిపింది. …
Read More »చంద్రబాబుపై సీఎం జగన్ సెటైరికల్ కామెంట్స్..
టీడీపీ ప్రభుత్వం చేసిన తప్పులను తమపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారని ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో మద్యం తయారీకి సంబంధించిన 20 డిస్టిలరీల్లో 14 డిస్టిలలరీలకు పర్మిషన్ ఇచ్చిన పాపం చంద్రబాబు ప్రభుత్వానిదేనని చెప్పారు. లిక్కర్ పాలసీపై శాసనసభలో జరిగిన స్వల్పకాలిక చర్చలో జగన్ మాట్లాడారు. నవరత్నాలు, అమ్మఒడి.. ఇవన్నీ తమ ప్రభుత్వ బ్రాండ్లని.. ప్రెసిడెంట్ మెడల్, గవర్నర్ ఛాయిస్, భూంభూం బీర్, 999 లెజెండ్, పవర్‌స్టార్ 999 …
Read More »ఏపీ అసెంబ్లీ-ఐదుగురు టీడీపీ సభ్యులు సస్పెండ్
ఏపీ అసెంబ్లీ నుంచి ఐదుగురు టీడీపీ సభ్యులను స్పీకర్ సస్పెన్షన్ చేశారు. వీరిని రెండు రోజుల పాటు సస్పెన్షన్ చేస్తున్నట్లు ప్రకటించారు. జంగారెడ్డి గూడెంలో సారా మరణాలపై చర్చించాలని పట్టు బడుతూ ఈ రోజు బుధవారం అసెంబ్లీలో చిడతలు వాయిస్తూ నిరసన తెలుపడంతో స్పీకర్ తమ్మినేని సీతారాం ఆగ్రహం వ్యక్తం చేశారు. శాసన సభా ఔన్నత్యాన్ని కాలరాస్తున్నారని, రోజురోజుకూ టీడీపీ సభ్యులు దిగజారుతున్నారని స్పీకర్ మండిపడ్డారు. మీరు శాసనసభ్యులే అని …
Read More »టైమ్ చూసుకుని మళ్లీ మూడు రాజధానుల బిల్లు: బొత్స
రాష్ట్రంలో మూడు రాజధానుల నిర్ణయానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. విజయవాడలో మీడియాతో ఆయన మాట్లాడారు. మూడు రాజధానులు తమ ప్రభుత్వం, పార్టీ విధానమని స్పష్టం చేశారు. ‘‘మొదటి నుంచీ ఇదే తమ విధామని చెప్తూనే ఉన్నాం. టైమ్ చూసుకుని అసెంబ్లీలో మళ్లీ మూడు రాజధానుల బిల్లు పెడతాం. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందడమనేది మా ప్రభుత్వ లక్ష్యం’’ అని బొత్స చెప్పారు.
Read More »ఈసారి కుప్పంలోనూ చంద్రబాబు ఓడిపోతారు: జగన్
అమరావతి: కమీషన్ల కోసం కక్కర్తి పడే సీఎంగా ఉన్నప్పుడు పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు తన చేతుల్లోకి తీసుకున్నారని ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఎన్నికల ముందు ప్రజల్ని మభ్యపెట్టాలనే ఉద్దేశంతో రూ.100కోట్లు ఖర్చు చేసి మరీ బస్సుల్లో జనాలను ప్రాజెక్టు వద్దకు తరలించి భజన చేయించుకున్నారని ఎద్దేవా చేశారు. పోలవరంపై శాసనసభలో జరిగిన స్వల్ప కాలిక చర్చలో జగన్ మాట్లాడారు. రూ.100 కోట్లు ఖర్చు చేసి ‘జయము జయము చంద్రన్న’ …
Read More »మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సొంతింటికి వెళ్లక ఐదేళ్లు. ఎక్కడుంటున్నాడు మరి ..?
ఉమ్మడి ఏపీ అఖరి మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సొంతూరు చిత్తూరు జిల్లా కలికిరిలోని సొంతింటికి వెళ్లక ఐదేళ్లు అవుతోందట. ఇందుకు కారణం ఆయన సొంత తమ్ముడు నల్లారి కిషోర్. 2019లో పీలేరు నుంచే ఏపీ ప్రస్తుత ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగు దేశం తరఫున పోటీ చేసిన సీఎం సోదరుడు ఆ తర్వాత అదే పార్టీలో జాతీయ నేతగా ఉన్నారు. దీంతో కాంగ్రెస్ జెండా కప్పుకుని …
Read More »ఏపీ అసెంబ్లీలో ‘పెగాసస్’ రచ్చ.. !
అమరావతి: ఏపీ శాసనసభలో ‘పెగాసస్’ అంశం చిచ్చు రాజేసింది. ఇటీవల వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అక్కడి అసెంబ్లీలో చేసి వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో మరింత వేడిని రాజేశాయి. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెగాసస్ స్పైవేర్‌ను ఏపీ ప్రభుత్వం కొనుగోలు చేసిందంటూ మమత పేర్కొన్నారు. దీనిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, అప్పటి ఐటీ మంత్రి లోకేష్ స్పందిస్తూ అలాంటిదేమీ లేదని.. ఆ స్పైవేర్‌ను కొనలేదని చెప్పారు. ఈ …
Read More »పవన్.. ఇంకెన్నాళ్లు ఈ డిపెండింగ్ పాలిటిక్స్?
‘దరువు.కామ్’ ప్రత్యేక కథనం అది మార్చి 14, 2014.. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా, ప్రముఖ సినీనటుడిగా ఉన్న పవన్‌కల్యాణ్ జనసేన పార్టీని ప్రకటించిన రోజు. తనకు అధికారం ముఖ్యం కాదని.. ప్రశ్నించేందుకే రాజకీయాల్లోకి వస్తున్నట్లు ఆయన చెప్పారు. దీంతో అటు ప్రజలు,ఇటు అభిమానులు అప్పట్లో పవన్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. తెలుగు రాష్ట్రాలకి.. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌కి ఎంతో ఉద్ధరిస్తారని జనం భావించారు. సీన్ కట్ చేస్తే ఈ ఎనిమిదేళ్ల జనసేన …
Read More »చంద్రబాబుకు విజయసాయిరెడ్డి కౌంటర్
ఏపీలో ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తే ఎవరూ బతకలేరంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెల్సిందే. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై అధికార పార్టీ అయిన వైసీపీకి చెందిన సెనియర్ నేత విజయసాయిరెడ్డి స్పందించారు. ఆయన స్పందిస్తూ ‘అవును, వైసీపీ అధికారంలోకి వస్తే దళారులు, లంచగొండులు, అక్రమార్కులు బతకలేరు. ఖజానాను, భూములను కొల్లగొట్టే రాబందులు బతకలేరు. ప్రజలకు మాత్రం …
Read More »పవన్ కల్యాణ్‌పై ఎమ్మెల్యే ద్వారంపూడి సంచలన వ్యాఖ్యలు
అమరావతి: జనసేన ఆవిర్భావ సభ ఆ పార్టీ ప్రమోషన్ కోసం కాదని.. పార్టీని అమ్ముకునేందుకని వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. సభకు ఇన్ని వేల మంది హాజరయ్యారు..నాకెంత ప్యాకేజీ ఇస్తారని అడిగేందుకే పవన్ కల్యాణ్ ఈ సభ పెట్టారని ఆరోపించారు. ఏపీ అసెంబ్లీ వద్ద ద్వారంపూడి మీడియాతో మాట్లాడుతూ పవన్‌పై విమర్శలు చేశారు. సినిమాల్లో పదిమందిని కొట్టినంత మాత్రాన హీరో కాదని పవన్‌ను ఉద్దేశించి ద్వారంపూడి వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో …
Read More »