వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా పాదయాత్ర ప్రస్తుతం ప్రకాశం జిల్లాను దాటి గుంటూరు జిల్లాలోకి ప్రవేశించిన సంగతి తెల్సిందే.ఈ నేపథ్యంలో జగన్ గత నూట పన్నెండు రోజులుగా చేస్తున్న పాదయాత్రకు అన్ని వర్గాల నుండి విశేష ఆదరణ లభిస్తుంది.అంతే కాకుండా ఇతర పార్టీలకు చెందిన నేతలు కూడా జగన్ సమక్షంలో వైసీపీ గూటికి చేరుతున్నారు.
See Also:ఏపీ రాజకీయాల్లో సంచలనం-రాజ్యసభ అభ్యర్థి వద్ద చంద్రబాబు అవినీతి చిట్టా..!!
అందులో భాగంగా చేజర్ల నారాయణ రెడ్డి వేలమంది తన అనుచర్లతో కల్సి ఆయన వైసీపీ గూటికి చేరారు.ఈ క్రమంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వీరికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.అనంతరం చేజర్ల మాట్లాడుతూ గత నాలుగు ఏండ్లుగా అరాచక పాలనను కొనసాగిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని టీడీపీ సర్కారుకు చరమగీతం పాడే సమయం వచ్చింది.
See Also:కర్నూల్లో జరిగే ఎమ్మెల్యే ఫంక్షన్ కు ఎన్టీఆర్
ఈ సమయంలో జగన్ కు అండగా ఉండాలని నా అనుచరవర్గంతో కల్సి పార్టీ మారాను .రానున్న కాలంలో జగన్ పాదయాత్ర ముగిసే వరకు జిల్లాకు చెందిన పలువురు సీనియర్ మాజీ ఎమ్మెల్యేలు ,మంత్రులు వైసీపీలో చేరతారని ..అందుకు నా చేరికే నాంది అని ఆయన అన్నారు .
See Also:వారం రోజులుగా ”అమరావతిలో సీబీఐ మకాం”..! కారణం తెలిస్తే షాక్..!!