ఏపీ ముఖ్యమంత్రి,అధికార తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత ఝలక్ ఇచ్చారు .తెలంగాణ టీడీపీ పార్టీకి చెందిన సీనియర్ నేత ,తెలుగు రైతు సంఘం అధ్యక్షుడు అయిన వంటేరు ప్రతాప్ రెడ్డి టీడీపీ పార్టీకి రాజీనామా చేశారు .
ఆయన రేపు శుక్రవారం కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు అని వార్తలు వస్తున్నాయి .అందులో భాగంగా వంటేరు ప్రతాప్ రెడ్డి టీడీపీ పార్టీకి ,ఆ పార్టీ అనుబంధ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు లేఖను టీటీడీపీ పార్టీ అధ్యక్షుడు ఎల్ రమణకు ,జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు ఫ్యాక్స్ పంపించారు .
రేపు శుక్రవారం కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్ధం పుచ్చుకోనున్నారు .ఆయనతో పాటు ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ,ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ కూడా రేపు దేశ రాజధాని ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు ..