Home / 18+ / కొత్త సంవత్సరం మొదటి రోజే చంద్రబాబు పరువు తీసిన విజయసాయి రెడ్డి

కొత్త సంవత్సరం మొదటి రోజే చంద్రబాబు పరువు తీసిన విజయసాయి రెడ్డి

ఈ ఏడాది మొత్తం సీఎం చంద్రబాబు యూటర్న్ లతో పార్టీల వెంబడి చక్కెర్లు కొట్టారు.ప్రత్యేక హోదా ఉద్యమాన్ని నీరు గార్చిన చంద్రబాబు వైసీపీ అధినేత, ప్రతిపక్షనేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి హోదా ఉద్యమంతో ఉలిక్కి పడ్డారు.అధికార టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజలతో మాట్లాడే భాష, కులమతాలను ఉద్దేశిస్తూ చేస్తున్న అవమానకర వాఖ్యలు, అహంకార పూరిత వైఖరి ప్రభుత్వంపై అసహ్యాన్ని పెంచాయి. ఇలాంటి నాయకులపై చంద్రబాబు కనీసం క్రమశిక్షణా చర్యలు కూడా తీసుకోకపోవడంపై అన్ని వర్గాల్లోనూ ఆగ్రహం పెల్లుబికింది.

 

ప్రకృతి వైపరీత్యాలు, దుర్ఘటనల సమయంలో సర్కారు తీరు, చంద్రబాబు ప్రచారార్భాటం ప్రజల్లో జుగుప్సుకు కారణం అయ్యాయి. రిషితేశ్వరి మరణం, పుష్కరాల దుర్ఘటన, వనజాక్షిపై దాడి, చింతమనేని దాష్టీకాలు, రాజధాని భూములు ఇలా ఎందులోనూ బాబు ఆదేశించిన కమిటీలు ఈ యేడాది కూడా వాస్తవాలను నిర్థారించలేదు.రుణమాఫీ, నిరుద్యోగభృతి, ఉద్యోగ కల్పన, నేరాలు పెరిగిపోవడం ఇలా ప్రతి అంశంలోనూ ప్రజల్లో అసంతృప్తి పెరిగిపోయింది. చంద్రబాబు అంటేనే రగిలిపోయే పరిస్థితి కనిపిస్తోంది.పింఛన్ల నుంచి ప్రభుత్వ కార్యకలాపాలవరకూ అన్ని వ్యవస్థలూ నిర్వీర్యం అయిపోయాయి. ఏడాది చివర్లో అగ్రిగోల్డు వ్యవహారం, హైకోర్టు ఏర్పాటు, జగన్ పై దాడులు, బీజేపీతో తగువులు, అవిశ్వాసంలో చంద్రబాబు తల బొప్పికట్టింది..

 

 

అలాగే టీడీపీ నేతలపై సిబిఐ, ఐటీ దాడులు, రెండుకళ్లు, రెండునాల్కల సిద్ధాంతపు చంద్రబాబుకు తెలంగాణ ఎన్నికల్లో జరిగిన పరాభవం వంటివి 2018 చంద్రబాబుకు ఇచ్చిన చెంపదెబ్బలే అనుకోవాలి.అయితే దీనిపై ట్విట్టర్ లో వైసీపీ సీనియర్ నాయకుడు,రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి చంద్రబాబు పై విరుచుకుపడ్డాడు.అయ్యా చంద్రబాబు గారు అంటూ మొదలుబెట్టి..సీఎం గా ఇదే మీకు చివరి జనవరి 1 అని,2014లో ఏపీ ప్రజలు మీకు గిఫ్ట గా ఇచ్చిన అధికారాన్ని 2019 లో వెనక్కి తీసుకోబోతున్నారు.ఇంతకంటే మీరు తెలుగు ప్రజలకు ఇవ్వగలిగింది ఏముంటుందో చెప్పండి? అని ట్విట్టర్ లో పోస్ట్ చేసారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat