Home / ANDHRAPRADESH / డేటా చోరి కేసులో సంచలన విషయాలు..?

డేటా చోరి కేసులో సంచలన విషయాలు..?

ఏపీ తెలంగాణ ఇరు రాష్ట్రాలను ఒక కుదుపు కుదుపుతోన్న ఐటీ గ్రిడ్స్‌ సంస్థ కేసులో పలు కీలక ఆధారాలు లభ్యమయ్యాయని తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ ఈ రోజు సోమవారం మీడియా సమావేశంలో వెల్లడించారు. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ లోకేశ్వర్‌ రెడ్డి ఫిర్యాదుతోనే ఐటీ గ్రిడ్స్‌లో సోదాలు చేశమన్నారు.ఈ సోదాలన్నీ సంబంధిత ఉద్యోగులు జరిపామన్నారు. ఈ ఐటీ సంస్థకు చెందిన ఉద్యోగులు విక్రమ్‌ గౌడ్‌, చంద్ర శేఖర్‌, ఫణి కుమార్‌, భాస్కర్‌ల సమక్షంలోనే ఆదారాలు సేకరించారు.

అంతే కాకుండా ఈ సోదాలలో లభ్యమైన కీలకమైన ఎలక్ట్రానిక్‌ డివైజ్‌లను సీజ్‌ చేసి ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపించడం జరిగిందన్నారు.ఈ కంపెనీకి చెందిన ఐబాల్‌, డెల్ కంప్యూటర్‌‌, ట్యాబ్‌టాప్‌, డెల్‌ సీపీయూ, మొబైల్‌ ఫోన్స్‌, ఇతర పరికరాలను స్వాదీనం చేసుకోవడంతో పాటుగా ఎంక్యాబ్‌ సిరీస్‌ ఎలక్ట్రానిక్‌ పరికరాలను సీజ్‌ చేశామని చెప్పారు. సేవామిత్ర యాప్‌ పేరుతో వ్యక్తిగత సమాచారాన్ని సేకరించారని, వీటికి సంబంధించిన ఆధారాలు కూడా సోదాల్లో లభించాయన్నారు. ఐటీ గ్రిడ్‌ డేటా అమెజాన్‌ సర్విస్‌లో భద్రపరినట్లు విచారణలో తేలడంతో నోటీసులు కూడా జారీచేశామని అన్నారు. నియోజకవర్గాల వారిగా ఓటర్‌ ఐడీ, ఆధార్‌ కార్డ్‌ సమాచారాన్ని ఐటీ గ్రిడ్స్‌ సంస్థ అక్రమంగా సేకరించిందన్నారు. అక్రమంగా డేటా సేకరించి, ఓట్లు తొలగిస్తున్నట్లు కొంతమంది చేసిన ఫిర్యాదుపై దర్యాప్తును కొనసాగిస్తామని స్పష్టం చేశారు.