Home / SLIDER / హ్యాట్సాప్ ఎమ్మెల్యే అరూరి రమేష్…

హ్యాట్సాప్ ఎమ్మెల్యే అరూరి రమేష్…

పేద ప్రజలకు నిత్యం అండగా ఉండే వర్ధన్నపేట ఎమ్మెల్యే శ్రీ అరూరి రమేష్ గారు మరోసారి తన దయా హృదయాన్ని చాటుకున్నారు. గ్రేటర్ వరంగల్ పరిధిలోని 57వ డివిజన్ పలివేల్పుల గ్రామానికి చెందిన పచ్చిమట్ల చందన అనే బాలిక వివాహా కార్యక్రమానికి వర్ధన్నపేట ఎమ్మెల్యే శ్రీ అరూరి రమేష్ గారు హాజరైయ్యారు.

అయితే పెళ్లికూతురు చందనకు తల్లిదండ్రులు లేరు అన్న విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే గారు నూతన వధూవరులకు 10వేల రూపాయల ఆర్ధిక సహాయం చేసి నియోజకవర్గ ప్రజల కష్ట సుఖాల్లో పాలుపంచుకునే నేత అని నిరూపించుకున్నారు. అక్కడే ఉన్న స్థానిక కార్పొరేటర్ జక్కుల శ్రీనివాస్ సైతం 5వేల రూపాయల ఆర్ధిక సహాయం అందజేశారు.