Home / 18+ / ప్రజల డబ్బుతో ప్రత్యేక హెలికాఫ్టర్ లో వెళ్లాల్సిన ప్రాధన్యత ఏముందో చెప్పాలి.!

ప్రజల డబ్బుతో ప్రత్యేక హెలికాఫ్టర్ లో వెళ్లాల్సిన ప్రాధన్యత ఏముందో చెప్పాలి.!

వైసీపీ ఎంపీ వేణుంబాక విజయసాయి రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబు పై విరుచుకుపడ్డారు. ట్విట్టర్ వేదికగా వరుస ట్వీట్లతో ఇటీవల విమర్శలు గుప్పిస్తున్న విజయసాయిరెడ్డి కాటన్ దొర జయంతి సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఆయన స్ఫూర్తితో పోలవరం పూర్తి చేస్తామని చెప్పారు. దీనిపై విజయసాయి రెడ్డి స్పందిస్తూ పోలవరం పేరును ప్రస్తావించి కాటన్ దొర ఆత్మ క్షోభించేలా చేయకు చంద్రబాబూ. ఎక్కడో జన్మించిన ఆ మహనీయుడు ఏ సౌకర్యాలు లేని రోజుల్లో ధవళేశ్వరం బ్యారేజి నిర్మించి చరిత్ర పురుషుడయ్యారు. తమరు నాలుగేళ్లలో పూర్తి కావాల్సిన ప్రాజెక్టును ఏటిఎంలా మార్చుకుని వేల కోట్లు మింగారంటూ విమర్శించారు.

19 న ఎగ్జిట్ పోల్స్ వైసీపీకి అనుకూలంగా వస్తాయని, ఎవరూ ఆందోళన చెందవద్దని, మళ్ళీ టీడీపీనే అధికారంలోకి వస్తుందని చంద్రబాబు టీడీపీ నేతలతో చెప్పడంపై దీనిపై విజయసాయి రెడ్డి స్పందిస్తూ తను చేయించిన 4 సర్వేల్లో టీడీపీ గెలుస్తుందని చెప్తూ మరోవైపు ఎగ్జిట్ పోల్స్ ను నమ్మొద్దనడం చాలా వింతగా ఉందన్నారు. మీడియా ఇంతగా విస్తరించిన తర్వాత కూడా దేన్ని నమ్మాలో, దేన్ని నమ్మకూడదో ప్రజలందరికీ తెలుసన్నారు. మీరు “ఏ సలహా, ఏ సహాయం కోసం రామోజీని కలిశారో చెప్పాలని, ప్రజాధనంతో హెలికాప్టర్‌లో వెళ్లి ఆయనను కలవాల్సినంత పనేమిటో ప్రజలకు చెప్పే ధైర్యం ఉందా.? అని ప్రశ్నించారు. ఓడిపోయిన తర్వాత ఆశ్రయం పొందడానికా.? కేసీఆర్‌ నిన్ను వదిలిపెట్టాలని ప్రాధేయపడటానికి వెళ్లావా.? ఇంతలా దిగజారిపోయావేంటి బాబూ.? అంటూ విమర్శలు సంధించారు విజయసాయి రెడ్డి.