Home / LIFE STYLE / గుండె పదిలంగా ఉండాలంటే అది చేయాల్సిందే..!

గుండె పదిలంగా ఉండాలంటే అది చేయాల్సిందే..!

ప్రస్తుత ఆధునీక సాంకేతిక రోజుల్లో ప్రతి రోజు బిజీ బిజీ షెడ్యూల్ కారణంగా ఎక్కువగా గుండె జబ్బుల బారిన పడుతుండటం మనం గమనిస్తూ ఉంటాం. అయితే దీనికి ప్రధాన కారణం మారిన మన జీవన శైలీ కావచ్చు.. ఆహారపు అలవాట్లు కావచ్చు.. సరిగ్గా నిద్రపోకపోవడం కావచ్చు.. కారణం ఏదైన సరే గుండెతో పాటుగా గుండె పనితీరును మంచిగా ఉంచుకోవాలంటే మనం కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఏమి చేయాలో ఒక లుక్ వేద్దామా..?. గుండె సరిగ్గా పనిచేయాలంటే వారంలో రెండు లేదా మూడు సార్లు చేపలను ఆహారంగా తీసుకోవాలి. చేపల్లో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు గుండెను పదిలంగా ఉంచుతాయి. ఎండు ఫలాల్లో ఒకటైన వాల్ నట్స్ డైలీ తీసుకోవాలి.వీటిలో ఉండే మోనో శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ శరీరంలోని కెలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తాయి.ప్రతి రోజు ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్లో ఓట్ మీల్ తినాలి. ఓట్స్లో ఉండే ఫైబర్ కొలెస్ట్రాల్ ను కరిగిస్తుంది. గుండె జబ్బులు రాకుండా చూస్తుంది. డార్క్ చాక్లెట్లను తినడం వలన కూడా గుండె ఆరోగ్యాన్ని సంరక్షించుకోవచ్చు. అంతేకాకుండా రోజుకు ఐదు లీటర్ల నీటిని తాగడం వలన కూడా గుండె మెరుగ్గా ఉంటుంది..