Home / 18+ / ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీని లోకేశ్, చంద్రబాబు ఎలా భూస్థాపితం చేసారు.?

ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీని లోకేశ్, చంద్రబాబు ఎలా భూస్థాపితం చేసారు.?

తెలుగువారి ఆత్మ గౌరవ నినాదంతో పుట్టిన టీడీపీ తాజా సార్వత్రిక ఎన్నికల్లో అధికారం కోల్పోయింది.. 175 స్థానాల్లో కేవలం 23 మంది మాత్రమే గెలిచారు. వీరిలో ఎవ్వరికీ సరైన మెజార్టీ కూడా రాలేదు. అయితే అతి తక్కువమంది ఎమ్మెల్యేలు ఉండడంతో అధికారపక్షంపై పోరాడేందుకు తమబలం సరిపోదని టీడీపీ అధిష్టానం భావిస్తుంది. ఇటీవల నందమూరి బాలయ్య కూడా ఇదే అన్నారు. తన తండ్రి స్థాపించిన పార్టీ అధికారం కోల్పోయి తుడిచి పెట్టుకుపోయే పరిస్థితుల్లో ఉందని ఆయన కూడా ఫీలవుతున్నారట. చంద్రబాబు, లోకేశ్ లు సైతం ఇదే ఫీల్ అవుతున్నారట.. గెలిచిన కొందరు ఎమ్మెల్యేలు వైసీపీలోకి వెళ్లి పోటీ చేసి మళ్లీ గెలవాలనుకుంటుంటే, మరికొందరు ఎమ్మెల్యేలతో పాటు ఓడిపోయిన ఎమ్మెల్యే అభ్యర్ధులను, టీడీపీ కేడర్‌ను తమ వైపు తిప్పుకోవడానికి బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. ఇప్పటికే బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ స్టార్ట్ చేసింది.

ఇందులో భాగంగా బీజేపీ అగ్రనేత‌ల ఎత్తులకు టీడీపీ నేత‌లంతా ఆ పార్టీలో చేరేందుకు క్యూ క‌డుతున్నారు. ఇప్పటికే టీడీపీ నుంచి నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరారు. మరో టీడీపీనేత అంబికాకృష్ణ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. అనంతపురం జిల్లా సీనియర్ నేత వరదాపురం సూరి కూడా బీజేపీలో చేరారు. అలాగే బాలయ్యకు అత్యంత సన్నిహితుడైన పొట్లూరి కృష్ణ‌బాబు కూడా బీజేపీలోకి వెళ్తున్నారట. మొత్తానికి ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీని అల్లుడు చంద్రబాబు, మనవడు లోకేశ్ లు భూస్థాపితం చేసారని అర్ధమవుతోంది.