Home / MOVIES / జబర్దస్త్ టీవీషో ఆర్టిస్ట్ వినోద్‌పై దాడి…ఇంట్లోకి చొరబడి మరి

జబర్దస్త్ టీవీషో ఆర్టిస్ట్ వినోద్‌పై దాడి…ఇంట్లోకి చొరబడి మరి

తెలుగు బుల్లితెర మీద టాప్‌ షోగా నడుస్తోంది జబర్దస్త్. బుల్లితెర ప్రేక్షకులకు అత్యంత దగ్గరైన ఈ షోలో నటులు కూడా తెలుగు ప్రేక్షకులకి సుపరిచితం. ఈ షోలో లేడీ గెటప్‌ లో నటించే నటుడు వినోద్‌ మీద హత్యాయత్నం జరిగింది. వినోద్‌పై హైదరాబాద్ నగరంలో శనివారం దాడి జరిగింది. కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో వినోద్‌పై ఒక వ్యక్తి దాడి చేసి.. తీవ్రంగా గాయపరిచాడు. కాచిగూడ పరిధిలోని కుత్బిగూడలో వినోద్‌ అద్దె ఇంట్లో నివాసముంటున్నారు. అయితే, అతని ఇంటి ఓనర్.. వ్యక్తిగత కక్షలతో దాడి చేసినట్టు తెలుస్తోంది. దాడి ఘటనపై వినోద్‌ కాచిగూడ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇంటి ఓనరే తనపై దాడి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఇంటి ఓనరే తనపై దాడి చేశారని జబర్దస్త్‌ వినోద్‌ ఆరోపించారు. కావాలనే తనను ఇంటిపైకి పిలిపించి కొందరితో కలిసి మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డారని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇల్లు కొనగోలు విషయంలో ఈ వివాదం తలెత్తిందని పేర్కొన్నారు. గతంలో ఇల్లు కొనగోలు కోసం ప్రమిల, బాలాజీకు రూ.10లక్షలు ఇచ్చామని, వాళ్లు ఇల్లు రిజిస్ట్రేషన్‌ చేయకుండా, డబ్బులు వెనక్కి ఇవ్వకుండా వేధిస్తున్నారని ఆరోపించారు. సెటిల్మెంట్ చేసుకుందామని రమ్మని హత్యాయత్నం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దాడిలో తీవ్రగాయాలపాలైన వినోద్‌.. నగరంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు

 

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat