Home / SLIDER / అపరిమిత వాయిస్ కాల్స్‌

అపరిమిత వాయిస్ కాల్స్‌

ప్రస్తుతం టెలికాం రంగాన్ని శాసిస్తున్న రిలయన్స్ జియో గిగాఫైబర్ దెబ్బకు ఇతర టెలికం కంపెనీలు దిగొస్తున్నాయి. జియోను ఎదుర్కొనేందుకు తాజాగా ఎయిర్‌టెల్ భారీ ఆఫర్ ప్రకటించింది. ఎయిర్‌టెల్-వి ఫైబర్ బ్రాండ్ బ్యాండ్ సేవల్లోని మూడు ప్లాన్లతో 200 జీబీ నుంచి 1000 జీబీ వరకు అదనపు డేటా ఇస్తున్నట్టు ప్రకటించింది.

ఎయిర్‌టెల్ బేసిక్ ప్లాన్ రూ.799, ఎయిర్‌టెల్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్లాన్ రూ.1099, ఎయిర్‌టెల్ ప్రీమియం ప్లాన్ రూ.1599తో ఈ అదనపు డేటా ఆఫర్ లభిస్తుంది.

ఎయిర్‌టెల్ బేసిక్ ప్లాన్‌లో ప్రస్తుతం 40 ఎంబీపీఎస్ వేగంతో 100 జీబీ డేటా లభిస్తోంది. ఇప్పుడు దీనికి అదనంగా 200 జీబీ డేటాను ఆరు నెలల కాలపరిమితితో ఇస్తున్నట్టు ఎయిర్‌టెల్ పేర్కొంది. ప్లాన్‌లో భాగంగా అపరిమిత వాయిస్ కాల్స్‌తోపాటు ‘ఎయిర్‌టెల్ థ్యాంక్స్’ ప్రయోజనాలు కూడా లభిస్తాయి.