Home / MOVIES / సెల్ టవర్ ఎక్కిన హీరో ప్రభాస్ అభిమాని

సెల్ టవర్ ఎక్కిన హీరో ప్రభాస్ అభిమాని

తన అభిమాన హీరో రాకపోతే ఎక్కిన సెల్ టవర్ నుండి దూకి చనిపోతా అని బెదిరించాడు రెబల్ స్టార్ హీరో ప్రభాస్ అభిమాని.తెలంగాణ రాష్ట్రంలోని జనగాం జిల్లా కేంద్రంలో ఉడుముల ఆస్పత్రి కి సమీపంలో ఉన్న ఒక సెల్ టవర్ ఎక్కిన హీరో ప్రభాస్ అభిమాని తనను కలవడానికి హీరో ప్రభాస్ రాకపోతే ఇక్కడ నుంచి దూకి చనిపోతా అని బెదిరింపులకు దిగాడు. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడకు చేరుకున్న వాళ్లు ఆ యువకుడ్ని సెల్ టవర్ నుంచి కిందకు దించేందుకు పలు ప్రయత్నాలు చేశారు.