Breaking News
Home / SLIDER / తెలంగాణ బీజేపీ అధ్యక్షుడుగా ఎంపీ..!

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడుగా ఎంపీ..!

తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు మార్పు తధ్యమా..?. ప్రస్తుతమున్న అధ్యక్షుడు కే లక్ష్మణ్ స్థానంలో వేరేవాళ్లను నియమించాలని ఆ పార్టీ జాతీయ అధిష్టానం ఆలోచిస్తుందా అంటే అవును అనే అంటున్నారు ఆ పార్టీ శ్రేణులు.

పార్టీ అధినేత మార్పులో భాగంగా కొత్తవారికి.. యువకుడికి అవకాశమివ్వాలని ఆలోచనలో ఉన్నారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో భాగంగా టీఆర్ఎస్ పార్టీకి కంచుకోట ..

ఉద్యమం నుంచి ఆ పార్టీకి అండదండగా ఉన్నా కరీం నగర్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి బీజేపీ తరపున బరిలోకి దిగి.. టీఆర్ఎస్ సీనియర్ నేత వినోద్ కుమార్ ను ఓడించి పార్లమెంట్లోకి అడుగెట్టిన బండి సంజయ్ కు అవకాశమివ్వాలని ఆర్ఎస్ఎస్ చీఫ్ భావిస్తున్నారని ఆ పార్టీ శ్రేణులు చెబుతున్నారు. చూడాలి మరి పార్టీ అధ్యక్షుడుగా ఎవరు వస్తారో..?