Breaking News
Home / MOVIES / హీరోగా ఎంట్రీ ఇవ్వనున్న వివి వినాయక్

హీరోగా ఎంట్రీ ఇవ్వనున్న వివి వినాయక్

టాలీవుడ్ ఇండస్ట్రీలో పలువురు హీరోలకు బ్లాక్ బ్లాస్టర్ చిత్రాలను అందించిన మాస్ డైరెక్టర్ వివి వినాయక్. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నుంచి మెగా స్టార్ చిరంజీవి వరకు అందరికీ మంచి హిట్ చిత్రాలను అందించాడు వినాయక్. అలాంటి వినాయక్ హీరోగా మారబోతున్నాడు. సరిగ్గా ఆరు దశాబ్దాల కింద జరిగిన ఒక కథాంశం ఆధారంగా ఈ చిత్రం నిర్మాణం జరగనున్నట్లు సమాచారం. ఇందులో రైతు పాత్రలో వివి వినాయక్ నటించనున్నారు. నరసింహా రావు దర్శకత్వం వహిస్తుండగా .. దిల్ రాజు నిర్మాతగా వ్యవహారిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ అక్టోబర్ 9వ తారీఖు నుంచి మొదలు కానున్నది.