Home / 18+ / సైరా చూసి ఆందోళన చెందుతున్న జక్కన్న..ఎందుకంటే..?

సైరా చూసి ఆందోళన చెందుతున్న జక్కన్న..ఎందుకంటే..?

టాలీవుడ్ సంచలన దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించబోతున్న చిత్రం ఆర్ఆర్ఆర్. ఇందులో రామ్ చరణ్ మరియు జూనియర్ ఎన్టిఆర్ స్వాతంత్ర్య సమరయోధుడు పాత్ర పోషిస్తున్నారు. అయితే ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి కధానాయకుడిగా ఎంతో ప్రతిష్టాత్మకంగా విడుదలైన చిత్రం సైరా నరసింహారెడ్డి. ఇందులో చిరు స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్ర పోషించారు. ఇది తెలుగులో అటు కలెక్షన్లు పరంగా ఇటు సినిమా పరంగా మంచి పేరు వచ్చింది. కాని మిగతా బాషల్లో కొంచెం తగ్గింది. రాజమౌళికి ఈ ఫలితంతో కలత చెందాడు. బాలీవుడ్ లో స్వాతంత్య్ర సమరయోధుల కధ ఆధారంగా వచ్చిన అనేక సినిమాలు లెజెండ్ ఆఫ్ భగత్ సింగ్, బోస్, మంగల్ పాండే వంటి చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద నిల్వలేకపోయాయి. మరి రాజమౌళి ఇప్పుడు తీస్తున్న చిత్రం దేశభక్తి చిత్రం..అందులోనూ ఆయన హిట్ సినిమాలు తీయడంలో సమర్ధుడు అయినప్పటికీ బాహుబలి కంటే పెద్దది అంటే కష్టమనే చెప్పాలి. ఇక బాహుబలి విషయానికి వస్తే అన్ని కోణాల్లో బాగుంది. మరి ఈ సినిమా విషయానికి వస్తే మరి ఇందులో దేశభక్తి మాత్రమే ఉండబోతుందా లేదా అన్ని కోణాల్లో చూపిస్తారా అనేది వేచి చూడాల్సిందే.