Home / NATIONAL / సోనియా గాంధీపై సీఎం సంచలన వ్యాఖ్యలు

సోనియా గాంధీపై సీఎం సంచలన వ్యాఖ్యలు

కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు సోనియా గాంధీని చచ్చిన ఎలుకతో పోలుస్తూ నోరు జారారు హర్యానా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి మనోహార్ లాల్ ఖట్టార్ . అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన సోనియా గాంధీ, ఆపార్టీకి చెందిన పలువురు నేతలపై విమర్శల వర్షం కురిపించారు.

ఆయన మాట్లాడుతూ గత ఎంపీ ఎన్నికల్లో దేశ ప్రజలు కాంగ్రెస్ పార్టీని.. సోనియా గాంధీ నాయకత్వాన్ని తిరస్కరించారు. ఇప్పటి వరకు జరిగిన ప్రతి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చావు దెబ్బ తగిలింది.

ప్రస్తుతం ఆ పార్టీకి జాతీయ అధ్యక్షురాలిగా ఉన్న సోనియా గాంధీ చచ్చిన ఎలుకతో సమానం అని ఆయన తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఖట్టార్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ నేతలు ఎదురు కౌంటరిస్తున్నారు.