Breaking News
Home / MOVIES / మహేష్‌ సరిలేరు నీకెవ్వరు మూవీ లేటెస్ట్ అప్‌డేట్..!

మహేష్‌ సరిలేరు నీకెవ్వరు మూవీ లేటెస్ట్ అప్‌డేట్..!

మహర్షి మూవీ తర్వాత ప్రిన్స్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ..సరిలేరు నీకెవ్వరు. F 2 వంటి బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన అనిల్‌ రావిపూడి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్న అనిల్ సుంకర, దిల్‌రాజులు నిర్మిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందన మహేష్ సరసన హీరోయిన్‌గా నటిస్తుండగా, సీనియర్ నటి విజయశాంతి ఓ పవర్‌ఫుల్ రోల్‌‌తో మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ సిన్మాకు సంబంధించి లేటెస్ట్ అప్‌డేట్ ఒకటి బయటకు వచ్చింది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ కోసం అన్నపూర్ణ స్డూడియోలో రెండున్నర కోట్లతో 7 ఎకరాల్లో నిర్మించిన భారీ సెట్‌ నిర్మించారు. ఈ చిత్రంలో చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్న ప్రకాష్‌రాజ్‌ ఇంటి కోసం ఈ భారీ సెట్‌ను నిర్మించారు. ఈ సెట్‌లో ఫైట్ సీన్ చిత్రీకరిస్తారని తెలుస్తోంది. కాగా ఈ చిత్రంలో మహేష్‌బాబు ఆర్మీ మేజర్ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. వచ్చే నెలాఖరికి ఈ చిత్రం షూటింగ్‌ను పూర్తి అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. సంక్రాంతికి సరిలేరు నీకెవ్వరు రిలీజ్ కానుంది. మొత్తంగా 7 ఎకరాల్లో నిర్మించిన భారీ ఇంటిసెట్‌లో మహేష్ ఫైట్ చేస్తుంటే..ఫ్యాన్స్‌కు పూనకాలు రావడం ఖాయం.