Home / NATIONAL / మహారాష్ట్ర రాజకీయాల్లో సంచలనం

మహారాష్ట్ర రాజకీయాల్లో సంచలనం

మహారాష్ట్ర రాజకీయాల్లో రోజుకో మార్పు జరుగుతుంది.ఇటీవల విడుదలైన మహా అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మెజారిటీ రాకపోవడంతో మహా రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి.ఈ ఎన్నికల్లో బీజేపీ 105,శివసేన 56,కాంగ్రెస్ 44,ఎన్సీపీ 54,ఇతరులు 29 స్థానాల్లో గెలుపొందాయి. అయితే ఒక పక్క మాకు మద్ధతు ఇస్తే పదమూడు మంత్రి పదవులతో పాటుగా డిప్యూటీ సీఎం పదవి ఇస్తామని బీజేపీ ఆఫర్ చేసింది.

మరోవైపు మాకు మంత్రి పదవులు వద్దు.ఏకంగా ముఖ్యమంత్రి పీఠమే కావాలని భీష్మించుకుని కూర్చుంది శివసేన .తాజాగా శివసేన పార్టీలోని ఎమ్మెల్యేలు రెండుగా చీలిపోయారని వార్తలు వస్తున్నాయి.ఇందులో ఒక వర్గం బీజేపీకి మద్ధతు ఇవ్వాలని నిర్ణయించింది.

మరోవైపు ఇంకో వర్గం లేదు మాకే ముఖ్యమంత్రి పీఠమివ్వాలని పట్టు బడుతుంది అని వార్తలు వస్తున్నాయి.దీంతో ఏమి చేయాలో తెలియక తల పట్టుకోవడం శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే వంతు అయింది అని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.చూడాలి మరి మహా రాజకీయాలు ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతాయో..?