Home / NATIONAL / మహా సంక్షోభంపై సుప్రీం తీర్పు ఇదే..?

మహా సంక్షోభంపై సుప్రీం తీర్పు ఇదే..?

మహారాష్ట్రలో ఎన్సీపీ నుండి సస్పెండైన అజిత్ పవార్ మద్దతుతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి విదితమే. అందులో భాగంగా నిన్న శనివారం ముఖ్యమంత్రిగా బీజేఎల్పీ నేత దేవేంద్ర పడ్నవీస్ .. ఉప ముఖ్యమంత్రిగా ఎన్సీపీ బహిష్కృత నేత అజిత్ పవార్ లచేత గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించారు.

దీనిపై ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సంఖ్యాబలం లేకపోయిన గవర్నర్ బీజేపీని ఎలా ఆహ్వానిస్తారని శివసేన,ఎన్సీపీ,కాంగ్రెస్ పార్టీల చీఫ్ లు దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీం కోర్టును ఆశ్రయించారు. దీంతో ఈరోజు ఆదివారం సెలవు దినమైన కానీ విచారణను చేపట్టిన సుప్రీం కోర్టు పడ్నవీస్ ప్రభుత్వానికి ఊరట ఇచ్చింది. కాంగ్రెస్ తరపున కపిల్ సిబల్ వాదనలను బలంగా వినిపించారు.

సుప్రీం కోర్టు స్పందిస్తూ వెంటనే బలపరీక్ష అవసరం లేదు. రేపు ఉదయం పదిన్నరకు విచారణ చేపడతామని తెలిపింది. అంతేకాకుండా గవర్నర్ నిర్ణయం రాజ్యంగ విరుద్ధమని జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం వ్యాఖ్యానించింది. దీంతో మహారాష్ట్ర ప్రభుత్వానికి ,దేవేంద్ర పడ్నవీస్ ,అజిత్ పవార్ లకు అత్యున్నత న్యాయ స్థానం నోటీసులు జారీ చేసింది.అంతే కాకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని పడ్నవీస్ కు గవర్నర్ పంపిన లేఖతో పాటుగా మద్దతు ఇస్తోన్న ఎమ్మెల్యేల జాబితాను రేపు కోర్టుకు సమర్పించాలని సీజే తుషార్ మెహతాను ధర్మాసనం ఆదేశించింది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat