Home / MOVIES / తీవ్ర విషాదంలో మెగా హీరోలు

తీవ్ర విషాదంలో మెగా హీరోలు

టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన మెగా హీరోలు తీవ్ర విషాదంలో ఉన్నారు. వీరితో పాటుగా మెగా అభిమానులందరూ కూడా ఈ రోజు తీవ్ర విషాదానికి గురయ్యారు.

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరమైన గ్రేటర్ హైదరాబాద్ చిరంజీవి యువత అధ్యక్షుడు నూర్ మహమ్మద్ చనిపోవడంతో మెగా హీరోలు.. మెగా అభిమానులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

మెగాస్టార్ చిరంజీవి,మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ,అల్లు శిరిష్, సాయిధరమ్ తేజ్ నూర్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుడ్ని కోరుతున్నట్లు సోషల్ మీడియాలో పేర్కొన్నారు.

ఈ సందర్భంగా నూర్ తో తమకున్న అనుబంధం గురించి వారు గుర్తు చేసుకున్నారు. మరోవైపు నూర్ భౌతికాయానికి అల్లు అర్జున్ నివాళులు అర్పించార. అనంతరం ఆయన కుటుంబానికి ఆర్థిక సాయమందించారు అర్జున్.