Home / 18+ / వివాదాస్పద దర్శకుడు వర్మ దుర్మరణం..?

వివాదాస్పద దర్శకుడు వర్మ దుర్మరణం..?

తాజాగా వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అమ్మ రాజ్యంలో కడప రెడ్లు అనే సినిమాను చిత్రీకరించిన విషయం అందరికి తెలిసిందే. అయితే ఈ సినిమాలో వర్మ చంద్రబాబు, లోకేష్ తో పాటు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ని దారుణంగా టార్గెట్ చేశాడు. సినిమాలో ఏమాత్రం సంబంధం లేకుండా పవన్ కళ్యాణ్ వచ్చి స్టేట్మెంట్లు ఇచ్చి వెళ్లిపోతుంటారు. అలాగే పవన్ కళ్యాణ్ టీడీపీతో కుమ్మక్కైన సన్నివేశాన్ని కూడా సినిమాలో చూపించారు. అయితే ఈ క్రమంలో జనసేన పార్టీ కార్యకర్తలు, పవన్ అభిమానులు వేదికగా సినిమా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పై విరుచుకుపడుతున్నారు. కొందరైతే పోస్టులు పెడుతున్నారు, మరికొందరైతే వర్ణ దుర్మరణం పాలై నట్టుగా జననం మరణం వేసి వర్మ ఫోటోలతో శ్రద్ధాంజలి ఘటిస్తారు. అయితే ఈ వివాదాస్పద దర్శకుడు వాళ్ళని తన శ్రద్ధాంజలి పోస్టు తోనే కౌంటర్ ఇచ్చాడు. తాను దెయ్యమై వస్తానని మీ నాయకుడి అంతు చూస్తాం అని చెప్పుకొచ్చాడు. అలాగే వర్మ చనిపోయాడు అంటూ పెద్దఎత్తున వైరల్ అయిన పోస్టులు ఫ్లైట్స్ ఫోటోలతో చాలామంది షాక్ అవుతున్నారు.