Home / SLIDER / మనది ఇందిరా కాంగ్రెస్సా.. వైఎస్సార్ కాంగ్రెస్సా-వీహెచ్ సంచలన వ్యాఖ్యలు

మనది ఇందిరా కాంగ్రెస్సా.. వైఎస్సార్ కాంగ్రెస్సా-వీహెచ్ సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత… సీనియర్ మాజీ రాజ్యసభ సభ్యులు.. మాజీ పీసీసీ చీఫ్ వి హన్మంతరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో వీహెచ్ మాట్లాడుతూ ప్రస్తుత రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ నాయకత్వాన్ని ప్రశ్నించారు.

ఇటీవల రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో పంజాగుట్ట సర్కిల్లో ఉన్న అంబేద్కర్ విగ్రహాన్ని జీహెచ్ఎంసీ సిబ్బంది తొలగించిన సంగతి విదితమే. ఆ సమయంలో వీహెచ్ కేసీఆర్ సర్కారును ప్రశ్నించారు.

తాజాగా ఆయన మాట్లాడుతూ”గతంలో అంబేడ్కర్ విగ్రహాన్ని పునః ప్రతిష్టించాలని నేను ధర్నాలు..పోరాటాలు చేసినప్పుడు.. అంబేద్కర్ విగ్రహాన్ని పోలీసు స్టేషన్లో ఉంచినప్పుడు మాట్లాడని కాంగ్రెస్ అధినాయకత్వం. నేతలు ఇప్పుడు వైఎస్సార్ స్మృతి వనాన్ని ఏర్పాటు చేయాలని ఎందుకు ఆలోచిసుందో చెప్పాలని ఆయన ఎదురు ప్రశ్నించారు. అసలు మనది ఇందిరా కాంగ్రెస్సా.. వైఎస్సార్ కాంగ్రెస్సా అని సంచలన వ్యాఖ్యలు చేశారు.