Home / MOVIES / సీక్వెల్ లో అనుపమ పరమేశ్వరన్

సీక్వెల్ లో అనుపమ పరమేశ్వరన్

తెలుగు సినిమా ఇండస్ట్రీలో వరుస మూవీలతో.. వరుస హిట్లతో దూసుకుపోతున్న అందాల రాక్షసి అనుపమ పరమేశ్వరన్. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ తెలుగు ,తమిళ,కన్నడం భాషాల్లో నటిస్తూ ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకుంది.

తాజాగా ఈ ముద్దుగుమ్మ సరిగ్గా ఐదేళ్ల కిందట విడుదలైన కార్తికేయ మూవీ సీక్వెల్ లో నటించనున్నారు అని ఫిల్మ్ నగర్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

యువహీరో నిఖిల్ హీరోగా.. చందు మొండేటి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ఇరువురికి బిగ్గెస్ట్ హిట్ నందించింది. ప్రస్తుతం దీనికి సీక్వెల్ గా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మించనున్నది. పాన్ ఇండియా మూవీగా ఈ చిత్రాన్ని తెరకెక్కించేందుకు చిత్రం నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.