Home / NATIONAL / జమిలి ఎన్నికలపై ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సంచలన వ్యాఖ్యలు

జమిలి ఎన్నికలపై ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సంచలన వ్యాఖ్యలు

జమిలి ఎన్నికలపై ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు మరోసారి వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా మనీ పవర్ ఇన్ ఎలక్షన్స్ పై జరిగిన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మాట్లాడుతూ”ఒకేసారి ఎన్నికలు జరిగితే అభివృద్ధికి ఆటంకం ఉండదు.పంచాయతీరాజ్ నుండి పార్లమెంట్ వరకు ఒకే సారి ఎన్నికలు జరిగితే మనీ ఆదా అవుతుంది.

వాజపేయి వంటి మహనీయుల సభలకు వెళ్తే సొంత ఖర్చుతో వెళ్తే వాళ్లమని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ రోజుల్లో పార్టీలు మీటింగులు పెట్టాలంటే మూడు బి లు పాటిస్తున్నాయన్నారు. మూడు బి లు అంటే బీరు బిర్యానీ బేటా అని చెప్పుకొచ్చారు.