Home / ANDHRAPRADESH / పండుగ పూట చంద్రబాబుపై విరుచుకుపడ్డ రోజా..!

పండుగ పూట చంద్రబాబుపై విరుచుకుపడ్డ రోజా..!

వైసీపీ ఎమ్మెల్యే ఏపీఐఐసి చైర్మన్ రోజా భోగి పండుగ నాడు కూడా చంద్రబాబుని వదలలేదు. ఆయనపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అమరావతి రైతుల విషయంలో వారికోసం సంక్రాంతి పండుగకు దూరంగా ఉన్నానని చెబ్తున్న చంద్రబాబు డ్రామాలు చేస్తున్నారని ఆమె అన్నారు. ఆయన ఎన్ని నటనలు చేసినా ప్రజలు నమ్మే పరిస్థితే లేదని అన్నారు. బాబు లాంటి పెద్ద నటుడు ఎవరూ ఉండరని ఆ విషయాన్ని అప్పట్లో ఎన్టీఆర్ నే చెప్పారని ఆవిడ కామెంట్స్ చేసారు. ఇప్పుడు ఇన్ని చెబుతున్నారు మీరు అధికారంలో ఉన్నప్పుడు రైతుల పొలాన్ని లాక్కొని వారికి అన్యాయం చేసారని ఆరోపించారు. అప్పుడు ప్రజలను నమ్మించి చివరికి గెలిచాక చేతులెత్తేసి ఇప్పుడు జోలె పట్టుకుని తిరుగుతున్నారంటూ మండిపడ్డారు.

 

 

 

 

ఆయన అధికారంలో ఉన్నప్పుడు రాజధానిని పెర్మినేంట్ చేయకుండా ఎందుకు వదిలేసారని ప్రశ్నించారు. మూడు లక్షల కోట్ల రూపాయల అప్పు తెచ్చిన చంద్రబాబు రాజధానికి ఏం చేసారని, ఆ డబ్బు ఏమైందని ప్రశ్నించారు. ఇప్పుడు విషయం పక్కనపెడితే ముందు ఆ డబ్బు మొత్తం ఎక్కడ పెట్టారో, ఎంత కర్చుపెట్టారో చెప్పాలని డిమాండ్ చేసారు. ముఖ్యమంత్రి జగన్ పాలనలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంతో ఆనందంగా ఉన్నారని. అది చూసి ఓర్వలేని చంద్రబాబు ఎన్నో కుళ్ళు, కుతంత్రాలతో ఏవేవో చెప్పి అందరిని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat