Home / NATIONAL / మూడోసారి సీఎం గా అరవింద్ కేజ్రీవాల్

మూడోసారి సీఎం గా అరవింద్ కేజ్రీవాల్

ఇటీవల విడుదలైన ఢిల్లీ సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో ప్రస్తుత అధికార పార్టీ అయిన ఆప్ మొత్తం అరవై రెండు స్థానాల్లో ఘనవిజయం సాధించింది. దీంతో వరుసగా మూడో సారి సీఎంగా అరవింద్ కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారం చేశారు.

ఢిల్లీ సీఎంగా అరవింద్ కేజ్రీవాల్ చేత లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ ప్రమాణ స్వీకారం చేయించారు. ధన్యవాద్ ఢిల్లీ పేరుతో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వీవీఐపీలతో పాటుగా పెద్ద ఎత్తున కార్యకర్తలు,అభిమానులు హాజరయ్యారు.

కేజ్రీవాల్ తో పాటుగా మనీష్ సిసోడియా ,కైలాస్ గెహ్లెట్,సత్యేంద్ర జైన్ తో పాటుగా మరికొందరు నేతలు ప్రమాణ స్వీకారం చేశారు..