Home / LIFE STYLE / కారం ఎక్కువగా తింటే కరోనా వస్తుందా..?

కారం ఎక్కువగా తింటే కరోనా వస్తుందా..?

కరోనా ప్రపంచాన్ని వణికిస్తోన్న సంగతి విదితమే.ఇప్పటికే దేశంలో కరోనా వైరస్ బాధితుల సంఖ్య పెరుగుతుంది. ఏపీ తెలంగాణలో ఈ వైరస్ ప్రభావాన్ని అడ్డుకోవడంలో ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకుంటున్నాయి.

అటు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి,ఇటు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ” కరోనాను తట్టుకోవడానికి పారాసిటమాల్ వేసుకుంటే సరిపోతుంది అని అన్నారు.

దీనిపై నెటిజన్లు ట్రోల్స్ వేశారు. తాజాగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి అదనపు కార్యదర్శి పీవీ రమేష్ ఇదే తరహాలో వ్యాఖ్యలు చేశారు.కారం మిరియాలు ఎక్కువగా తింటే కరోనా వచ్చే అవకాశముందని అన్నారు.

అంతే కాకుండా జలుబు దగ్గు వస్తే ఆరు గంటలకు ఒక సారి పారాసిటమాల్ వేసుకుంటే సరిపోతుందని ఆయన సూచించారు. పీవీ రమేష్ చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు ట్రోల్స్ వదులుతున్నారు.