Home / SLIDER / కరోనా ఎఫెక్ట్ -రైతులకు సీఎం కేసీఆర్ శుభవార్త

కరోనా ఎఫెక్ట్ -రైతులకు సీఎం కేసీఆర్ శుభవార్త

తెలంగాణ రైతాంగానికి ముఖ్యమంత్రి కేసీఆర్ శుభవార్తను ప్రకటించారు.శుక్రవారం ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి మీడియాతో మాట్లాడుతూ” తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం పంట చేతికోచ్చే సీజన్.అందుకే రైతులెవరూ ఆగంమాగం అవ్వద్దు..

ప్రతి గింజను ప్రభుత్వమే కొంటుంది.మీ ఇంటికోచ్చే ప్రభుత్వం కొంటుంది.కనీస మద్ధతు ధరతోనే ప్రతి పంటను ప్రభుత్వం కొంటుంది.పంటను కొనే సమయంలోనే ప్రతి రైతు యొక్క పాస్ బుక్,అకౌంటు నెంబర్లకు సంబంధించి పూర్తి వివరాలను తీసుకుంటుంది.డబ్బులను చెక్కుల రూపంలో రైతులకు అందజేస్తాం..

మీరు కాస్త ఆలస్యమైన కానీ వాటిని విత్ డ్రా చేస్కోవచ్చు.మీకు నమ్మకముంటే వ్యాపారులకు కూడా అమ్ముకోవచ్చు.అయితే వ్యాపారులు కనీస మద్ధతు ధరకు కొనాలి అని ఆయన సూచించారు.పంటలన్నీ పూర్తయ్యేవరకు నీళ్లను అందిస్తాము అని ప్రకటించారు.