ప్రముఖ ప్రభుత్వ టెలికాం సంస్థ అయిన బీఎస్ఎన్ఎల్ సంచలన నిర్ణయాన్ని తీసుకుంది.దేశ వ్యాప్తంగా ఏప్రిల్ పద్నాలుగో తారీఖు వరకు కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించిన సంగతి తెల్సిందే.
ఈ నేపథ్యంలో మొబైల్ వినియోగదారుల రీఛార్జ్ వ్యాలిడిటీని పెంచాలని ట్రాయ్ సూచించిన సంగతి విదితమే.దీంతో ఏప్రిల్ ఇరవై తారీఖు వరకు వ్యాలిడిటీని పెంచుతూ బీఎస్ఎన్ఎల్ సంచలన నిర్ణయం తీసుకుంది.ప్రీపెయిడ్ వినియోగదారుల సర్వీసులను ఎలాంటి రీఛార్జ్ చేసుకోకపోయిన కానీ డిస్ కనెక్ట్ చేయబోమని తెలిపింది.
అంతే కాకుండా పది రూపాయల బ్యాలెన్స్ కూడా ఇస్తున్నామని ప్రకటించింది.పేదలు,అవసరమైన ప్రజల కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీఎస్ఎన్ఎల్ పేర్కొన్నది.