Home / NATIONAL / తమిళనాడులో మరో 75కరోనా కేసులు

తమిళనాడులో మరో 75కరోనా కేసులు

తమిళనాడు రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి వేగవంతమవుతుంది.తాజాగా కరోనా కేసుల సంఖ్య దేశంలో రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి.ఒక్క తమిళనాడు రాష్ట్రంలో ఒక్కరోజే డెబ్బై ఐదు కేసులు నమోదయ్యాయి.

దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 309కు చేరుకున్నాయి.మరోవైపు కేరళ రాష్ట్రంలో కొత్తగా 21 కరోనా కేసులు నమోదయ్యాయి అక్కడి అధికారులు తెలిపారు.దీంతో కేరళ రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 286కు చేరుకుంది.

మరోవైపు మహారాష్ట్రలో 339కేసులు నమోదు అయితే పదహారు మంది మృత్యువాతపడ్డారు.ఇక దేశ రాజధాని ఢిల్లీలో 67కేసులు నమోదయ్యాయి.