Home / LIFE STYLE / కరోనా లక్షణాలు ఎన్ని రోజులకు కన్పిస్తాయి..?

కరోనా లక్షణాలు ఎన్ని రోజులకు కన్పిస్తాయి..?

కోవిడ్-19(కరోనా వైరస్)…ఇది ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్న కొత్త వైరస్. ప్రపంచదేశాలను వణికిస్తున్న ఈ వైరస్కు ఇప్పటి వరకు ఎటువంటి చికిత్స అందుబాటులో లేదు.

ఈ నేపథ్యంలో కరోనా వైరస్ అంటే ఏమిటీ? దానికి ఆ పేరు ఎలా వచ్చింది? అది ఎక్కడ పుట్టింది? ఎలా విస్తరిస్తుంది? దాని లక్షణాలేమిటీ? అన్న అంశాలను నిశితంగా పరిశీలిద్దాం…

వైరస్ సోకిన వ్యక్తి తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు ఆ వైరస్ వాతావరణంలో చేరి, గాలి ద్వారా సమీపంలో ఉన్నవారికి సోకుతుంది.

కోవిడ్-19 మనిషికి సోకిన పది రోజుల తర్వాత లక్షణాలు బయటపడుతాయి. స్వైన్‌ఫ్లూలో కన్పించే లక్షణాలే (దగ్గు, జలుబు, జ్వరం, తలనొప్పి, ఒంటి నొప్పులు) కరోనాలోనూ కన్పిస్తాయి. ఈ రెండు లక్షణాలు ఒకేలా ఉండటం వ్యాధి గుర్తింపు వైద్యులకు కూడా కష్టమే. వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేస్తే తప్పా..కరోనా నిర్ధారణ చేయడం కుదరదు.

వ్యాప్తి ఇలా..
ఈ వైరస్ జంతువుల్లోను, జంతువుల నుంచి మనుషులకూ వ్యాప్తి చెందగలదు.
గాలి ద్వారా ఇతర ఇతరులకు సోకుతుంది. వైరస్ బారినపడ్డ వారికి సన్నిహితంగా ఉన్నా ప్రమాదమే.
వూహాన్‌లోని సముద్ర ఉత్పత్తుల మార్కెట్.. ఈ వ్యాధికి కేంద్ర స్థానమని శాస్త్రవేత్తల అభిప్రాయం.

వ్యాధి లక్షణాలు
కోవిడ్-19 వేగంగా వ్యాప్తి చెందేందుకు ముఖ్యకారణం మనుషుల నుంచి మనుషులకు సోకే లక్షణం ఉండటమే. కోవిడ్-19 సోకినట్లయితే మొదటి దశలో శ్వాసపరమైన ఇబ్బందులు ఏర్పడతాయి. ఆయాసం వస్తుంది. ఛాతిలో నొప్పిగా ఉంటుంది. రెండో దశలో దగ్గు, జ్వరం వస్తుంది.

మూడో దశలో అది పూర్తి నిమోనియాగా మారుతుంది. అప్పటికీ నివారించలేకపోతే శ్వాసకోశ వ్యవస్థ పూర్తిగా దెబ్బతిని ప్రాణం పోతుంది. వ్యాధి సోకిన రోగులు ఆస్పత్రిలో చేరి 14 రోజులపాటు ఇంకుబేటర్‌లో ఉంటే చాలు… వ్యాధి నుంచి బయట పడవచ్చు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat