Home / NATIONAL / ఆ జోన్లల్లో బస్సులకు అనుమతి

ఆ జోన్లల్లో బస్సులకు అనుమతి

లాక్‌డౌన్‌ను మరో రెండు వారాల పాటు పొడిగిస్తూ కేంద్రం పలు ఆంక్షలు విధించింది.

అంతర్‌ జిల్లా బస్సు సర్వీసులకు అనుమతి ఉండదని కేంద్రం ప్రకటించింది. గ్రీన్‌ జోన్ల పరిధిలో 50 శాతం ప్రయాణికులతో బస్సులు తిరిగేందుకు అనుమతి ఇచ్చింది కేంద్రం. ఆరెంజ్‌ జోన్లలో ట్యాక్సీ సేవలకు డ్రైవర్‌, సహాయకుడి సాయంతో బయటకు వెళ్లొచ్చు.

రెడ్‌ జోన్లలో ఎలక్ట్రానిక్‌ మీడియా, ఐటీ సేవలు, డేటా కాల్‌ సెంటర్లకు మాత్రమే అనుమతి ఇచ్చారు. రెడ్‌ జోన్లలో సైకిళ్లు, ఆటోలు, క్యాబ్‌లు, ట్యాక్సీలు, సెలూన్లకు అనుమతి లేదు. రవాణా, విద్యాలయాలు, సినిమాహాళ్లు, జిమ్‌లు, క్రీడా ప్రాంగణాలు, స్విమ్మింగ్‌ఫూల్స్‌ మూసే ఉంటాయి. గ్రామీణ ప్రాంతాల్లో అన్ని వ్యవసాయ పనులకు కేంద్రం అనుమతి ఇచ్చింది.