Home / ANDHRAPRADESH / ఏపీలో భారీగా కరోనా కేసులు

ఏపీలో భారీగా కరోనా కేసులు

ఏపీలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ వస్తుంది.తాజాగా రాష్ట్రంలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదయ్యాయి.

గడిచిన 24 గంటల్లో 1608 కరోనా కేసులు నమోదు అయ్యాయి.. వీటిలో రాష్ట్రానికి చెందినవి 1576 కాగా, మరో 32 కేసులు ఇతర రాష్ట్రాల, దేశాల నుంచి వచ్చిన వారివిగా నమోదయ్యాయి.

తాజా కేసులతో కలిపి ఏపీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 25,422కు చేరింది.. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 11,936 ఉన్నాయి.

13,194 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇక తాజాగా 15 మంది చనిపోయారు.. మొత్తం మరణాల సంఖ్య 292 కు చేరింది.