Home / SLIDER / తెలంగాణలో తగ్గిన కరోనా కేసుల సంఖ్య

తెలంగాణలో తగ్గిన కరోనా కేసుల సంఖ్య

తెలంగాణలో ఆదివారం కూడా తక్కువగానే కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 1269 కేసులు నమోదయ్యాయి.

దీంతో మొత్తం కేసుల సంఖ్య రాష్ట్రంలో 34,671కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 11,883కు చేరుకుంది..ఇప్పటివరకు మొత్తం 22,482 మంది వైరస్ నుంచి కోలుకున్నారు.

గడిచిన 24 గంటల్లో 8 మంది వైరస్ వల్ల మరణించారు.. మొత్తం మృతుల సంఖ్య 356కి చేరింది. తాజా కేసుల్లో GHMC పరిధిలో 800 కేసులు నమోదయ్యాయి.