ఏపీలో సంచలనం సృష్టించిన ఈఎస్ఐ కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన మాజీమంత్రి,టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడి బెయిల్ పిటిషన్ పై సోమవారం హైకోర్టులో వాదనలు ముగిశాయి…
బెయిల్ ఇవ్వాలా? లేదా? అనే దానిపై నేడు హైకోర్టు నిర్ణయం తీసుకోనుంది. అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేసి 45 రోజులు దాటింది.
సాక్ష్యాల సేకరణ కూడా పూర్తయింది అటు ఈ కేసులో మొదటి నిందితుడిగా ఉన్న ఐఎంఎస్ మాజీ డైరెక్టర్ రమేశ్ కుమార్ బెయిల్ పిటిషన్ పై కూడా ఇవాళ విచారణ జరగనుంది.