Home / HYDERBAAD

HYDERBAAD

ఈసారి ఖైరతాబాద్ గణపతి ఎత్తు ఎంతో తెలుసా..?

బొజ్జ గణపతులందు ఖైరతాబాద్‌ గణపతి వేరు! ఏడాదికొక అడుగు చొప్పున ఎత్తు పెరుగుతూ తొండమునేకదంతంతో.. కొండంత రూపంతో భక్తులను కాచేభవహరుడు ఆ స్వామి!! 2019లో అక్కడ 65 అడుగుల ఎత్తైన గణేశుడి ప్రతిమను రూపొందించిన నిర్వాహకులు.. ఈసారి కరోనా నేపథ్యంలో కేవలం 9 అడుగుల ఎత్తుతో ధన్వంతరీ నారాయణ మహాగణపతిగా తీర్చిదిద్దుతున్నారు. ఆ స్వామికి అటూ ఇటూ లక్ష్మి, సరస్వతి అమ్మవార్లు కొలువుదీరనున్నారు

Read More »

27 అడుగుల ఎత్తులో ఖైరతాబాద్‌ గణపతి

వినాయక చవితి పండుగ అనగానే హైదరాబాదీలతో పాటు మిగతా ప్రాంతాల వారికి ఖైరతాబాద్‌ గణపతి గుర్తుకు వస్తాడు.  ప్రతి ఏడాది ఈ భారీ వినాయకుడిని  చూసేందుకు ప్రతి ఒక్కరూ ఉత్సాహం చూపుతుంటారు. కరోనా నేపథ్యంలో ఈ ఏడాది 27 అడుగుల ఎత్తులో  ఖైరతాబాద్‌ గణపతిని ప్రతిష్టించాలని గణేష్‌ ఉత్సవ కమిటీ నిర్ణయించింది. విగ్రహం ఎత్తు 27 అడుగులే కావడంతో పూర్తిగా  మట్టి వినాయకుడిని  ప్రతిష్టించాలని కమిటీ భావిస్తోంది. ఈసారి ధన్వంతరి …

Read More »

కొవిఫర్ ఔషధం ధర ఎంతో తెలుసా…?

కరోనా చికిత్స కోసం ‘కొవిఫర్‌’ ఔషధాన్ని ఆవిష్కరించిన హెటిరో సంస్థ తాజాగా దాని ధరను ప్రకటించింది. 100 మిల్లీ గ్రాముల వయల్‌ ధరను రూ.5,400 (దాదాపు 71 డాలర్లు)గా నిర్ణయించింది. మొదటివిడుతగా 20వేల వయల్స్‌ను అందుబాటులోకి తేనున్నట్టు తెలిపింది. ఇందులో తొలిబ్యాచ్‌లో 10వేల వయల్స్‌, తర్వాతి బ్యాచ్‌లో మరో 10వేల వయల్స్‌ను పంపిణీ చేయనుంది. తొలి 10వేల వయల్స్‌ను హైదరాబాద్‌తోపాటు కరోనా తీవ్రత అధికంగా ఉన్న తమిళనాడు, గుజరాత్‌, ఢిల్లీ, …

Read More »

తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 191కరోనా కేసులు నమోదు అయ్యాయి.వీటితో కలిపి ఇప్పటివరకు మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,111కి చేరుకుంది. అయితే గడిచిన ఇరవై నాలుగంటల్లో నమోదైన కేసుల్లో ఒక్క జీహెచ్ఎంసీలోనే 143కరోనా కేసులు నమోదయ్యాయి.రాష్ట్రంలో కరోనాతో నిన్న ఒక్కరోజే ఎనిమిది మంది మృతి చెందారు. మొత్తం 156మంది ఇప్పటివరకు కరోనా భారీన పడి మృతి చెందారు.తెలంగాణలో మొత్తం యాక్టివ్ కేసులు 2138గా ఉన్నాయి.మొత్తం డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య …

Read More »

సీఎం కేసీఆర్ కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కి కేంద్ర హోం సహయక శాఖ మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా నివారణకు అవసరమైన నియంత్రణ చర్యలు,కేంద్ర ఆరోగ్య శాఖ సూచిస్తున్న పలు సూచనలను కట్టుదిట్టంగా అమలు చేయాలని ఆయన సీఎం కేసీఆర్ కు సూచించారు.రాష్ట్ర రాజధాని నగరం హైదరాబాద్,సికింద్రాబాద్ జంట నగరాల్లో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి.. ప్రజలకు భరోసా …

Read More »

మంత్రి సత్యావతి రాథోడ్ గొప్ప మనస్సు

ఆమె సహజంగానే దయామయి. ఎవరినీ నొప్పించని తత్వం. ఎవరైనా బాధపడితే చూడలేని మనస్తత్వం. అలాంటామె కళ్ల ముందు రోడ్డు మీద ఒక వాహనదారుడు అపస్మారక స్థితిలో పడిపోయి కనిపిస్తే ఇక ఆ స్పందన ఎలా ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. నిజంగా నేడు ఈ సందర్భమే ఎదురైంది. మహబూబాబాద్‌ నుంచి హైదరాబాద్‌కు రాష్ట్ర గిరిజన సంక్షేమ, స్త్రీ-శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ వస్తుండగా మహబూబాబాద్‌ జిల్లా ఆలేరు దగ్గర …

Read More »

హైదరాబాద్ నగరంలో కరోనా కల్లోలం

హైదరాబాద్ నగరంలో కరోనా కల్లోలం సృష్టిస్తున్నది. రోజురోజుకూ కేసులు పెరిగిపోతుండటంతో సామాన్యులతో పాటు వైద్యులు, పోలీసులు వణికిపోతున్నారు. ఆదివారం నగరంలో మొత్తం 132 పాజిటివ్‌ కేసులు నమోదుకాగా ఆరుగురు మృతి చెందారు. అయితే పాజిటివ్‌ వచ్చిన వారిలో ఉస్మానియా, గాంధీ, నిలోఫర్‌, నిమ్స్‌ తదితర వైద్యశాలలకు చెందిన వైద్యులు కూడా ఉన్నారు. అంతేకాకుండా తొమ్మిది మంది పోలీసులు, 108 ఉద్యోగి, కొరియర్‌బాయ్‌, ఆటోడ్రైవర్‌ ఉన్నట్లు వైద్యాధికారులు ప్రకటించారు. వీరిని చికిత్స …

Read More »

కరోనాతో టీవీ 5 జర్నలిస్టు మృతి

కరోనా మహమ్మారితో టీవీ 5 న్యూస్‌చానల్‌ జర్నలిస్టు దడిగె మనోజ్‌కుమార్‌ (33) మృతిచెందారు. గాంధీ దవాఖానలో చికిత్సపొందుతూ ఆదివారం ఉదయం చనిపోయారు. యువ జర్నలిస్ట్‌ మనోజ్‌కుమార్‌ మృతికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సంతాపం వ్యక్తంచేశారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. హైదరాబాద్‌ మాదన్నపేటకు చెందిన మనోజ్‌కుమార్‌ కొన్నేండ్లుగా టీవీ 5 న్యూస్‌చానల్‌ క్రైమ్‌ రిపోర్టర్‌గా పనిచేస్తున్నారు. ఎనిమిది నెలల కిందటే సైదాబాద్‌కు చెందిన యువతితో వివాహం కాగా, ప్రస్తుతం …

Read More »

జీహెచ్ఎంసీ అలెర్ట్.. నిబంధనలు పాటించకుంటే సీజ్‌

లాక్‌డౌన్‌ ఉల్లంఘనల నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ అప్రమత్తమైంది. నగరంలో నిబంధనలకు విరుద్ధంగా జిమ్‌లు, ఇనిస్టిట్యూట్లు, స్టడీ రూమ్‌లు, స్పోర్ట్స్‌ క్లబ్‌లు, ఫిట్‌నెస్‌ స్టూడియోలు, బార్‌ అండ్‌ రెస్టారెంట్లు తెరుస్తోన్న నేపథ్యంలో కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. అనుమతి ఉన్న దుకాణాలు, సంస్థల వద్ద భౌతికదూరం, మాస్క్‌ ధరించడం తదితర నిబంధనలు పాటించకున్నా సీజ్‌ చేయనున్నారు. సోమవారం నుంచి గ్రేటర్‌వ్యాప్తంగా విస్తృత తనిఖీలు నిర్వహించనున్నట్టు ఈవీడీఎం డైరెక్టర్‌ విశ్వజిత్‌ కంపాటి తెలిపారు. ఇప్పటికే …

Read More »

హైదరాబాద్ లో వలస కార్మికులకు బియ్యం, నగదు పంపిణీ

హైదరాబాద్ నగరంలోని చర్లపల్లిలో వలస కార్మికులకు నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌ ఈ ఉదయం బియ్యం, నగదు పంపిణీ చేశారు. ఒక్కొక్కరికి 12 కిలోల బియ్యం, రూ. 500 మేయర్‌ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పౌరసరఫరాల సంస్థ చైర్మన్‌ శ్రీనివాస్‌ రెడ్డి, ఎమ్మెల్యే సుభాష్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేయర్‌ మాట్లాడుతూ.. పేదలకు స్వచ్చంధ సంస్థలు, దాతలు ఆహారం పంపిణీ చేయడం అభినందనీయం అన్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో …

Read More »