Home / HYDERBAAD / హైదరాబాద్‌లో భారీ వర్షాలు- ట్రాఫిక్ పోలీసులు కీలక నిర్ణయం

హైదరాబాద్‌లో భారీ వర్షాలు- ట్రాఫిక్ పోలీసులు కీలక నిర్ణయం

హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలతో నగరంలో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అవుతున్నది. ఈ క్రమంలో సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు నగర పరిధిలోని సాఫ్ట్‌వేర్‌ కంపెనీలకు కీలక సూచనలు చేశారు.

ఇవాళ, రేపు ఐటీ ఉద్యోగులు మూడు విడుతల్లో లాగౌట్‌ చేయాలని సూచించారు. ఐకియా – సైబర్‌ టవర్స్‌ వరకు ఐటీ ఆఫీసుల్లో మధ్యాహ్నం 3 గంటలకు లాగౌట్‌ చేయాలని, ఐకియా – బయోడైవర్సిటీ వరకు ఐటీ ఆఫీసుల్లో సాయంత్రం 4.30 గంటలకు లాగౌట్‌ చేయాలని సూచించారు.

ఐకియా – రాయదుర్గం వరకు ఐటీ ఆఫీసుల్లో సాయంత్రం 4.30 గంటలకు, ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌లోని ఐటీ ఆఫీసుల్లో మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల మధ్య లాగౌట్‌ చేయాలని కోరారు. గచ్చిబౌలి ఐటీ ఆఫీసుల్లో మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల మధ్య లాగౌట్‌ చేయాలని విజ్ఞప్తి చేశారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat