తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్‌లో గురువారం పార్కులు మూసిఉండనున్నాయి . తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 22న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం ఎదురుగా ఉన్న అమరవీరుల స్మారకాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు.
ఈ సందర్భంగా సెక్రటేరియట్ పరిసరాల్లో ఉన్న పార్కులకు హెచ్‌ఎండీఏ సెలవు ప్రకటించింది.సామాన్య ప్రజానీకానికి, పార్కులకు వచ్చే సందర్శకులకు ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు ముందస్తు జాగ్రత చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు హెచ్ఎండీఏ అధికారులు తెలిపారు. బుద్ధ పూర్ణిమ ప్రాజెక్టు (బీపీపీ) పరిధిలో ఉన్న లుంబినీ పార్క్, ఎన్టీఆర్ ఘాట్, ఎన్టీఆర్ గార్డెన్‌లను మూసివేయనున్నట్లు చెప్పారు.