తెలంగాణలో హైదరాబాద్ మెట్రో రైళ్ల ప్రయాణపు వేళలు మారాయి. ఇందులో భాగంగా నగరంలోని జూబ్లీ బస్టేషన్ (జేబీఎస్), మహాత్మాగాంధీ బస్టేషన్ (ఎంజీబీఎస్) మధ్య కారిడార్-II లో మెట్రో రైలు సమయాన్ని ఉదయం 6 నుంచి రాత్రి 11 గంటలకు మార్చినట్లు మెట్రో అధికారులు వెల్లడించారు.
హైదరాబాద్ మెట్రోలో ప్రయాణికుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండగా రద్దీకి అనుగుణంగా సర్వీసులు నడపడం అధికారులకు టాస్క్ గా మారింది. ప్రధానంగా ఆఫీసు వేళల్లో మెట్రోల్లో విపరీతమైన రద్దీ ఉంటుంది.