కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కుత్బుల్లాపూర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ ఏ. నాగమణి గారు,గాజులరామారం సర్కిల్ డిప్యూటీ కమిషనర్ ఎల్. పి. మల్లారెడ్డి గారు, కూకట్పల్లి ఏసిపి శివ భాస్కర్ గారు నూతనంగా పదవి బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఈ రోజు ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ గారిని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు కొద్ది రోజులుగా నియోజకవర్గంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో వరదలపై ఎప్పటికప్పుడు అధికారులు సమీక్షలు జరుపుతూ నియోజకవర్గ పరిధిలోని పురాతన భవనాలను గుర్తించి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, క్షేత్రస్థాయిలో ఉన్న ఉన్నతాధికారులతో సహా కిందిస్థాయి సిబ్బంది వరకు అందరూ పనిచేయలని ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడాలని సూచించారు..