ఏపీ ప్రభుత్వం 2014 ,2015 ,2016 సవంత్సరాలకు గాను టాలీవుడ్ ఇండస్ట్రీలో విడుదలైన ఉత్తమ సినిమాలకు నంది అవార్డులను ప్రకటించిన విషయం విదితమే .ఈ అవార్డుల ప్రకటనపై ఇంట బయట విమర్శలు వస్తున్నాయి .నెటిజన్లు మొదలు సినిమా విమర్శకుల వరకు ,రాజకీయ నేతల దగ్గర నుండి సినిమా వాళ్ళ వరకు అందరు అవి నంది అవార్డులు కాదు నారా వారి అవార్డులు అని అంటున్నారు …
లేదు కమ్మ అవార్డులు ..కాదు టీడీపీ అవార్డులు అని ఇలా పలువురు పలురకాలుగా స్పందిస్తున్నారు .నిర్మాత మొదలు దర్శకుడు వరకు అందరు బాబు సర్కారును తప్పు పడుతున్నారు .ఈ నేపథ్యంలో లెజెండ్ మూవీకి గాను ఉత్తమ విలన్ విభాగానికి నంది అవార్డును దక్కించుకున్న ప్రముఖ ఒకప్పటి స్టార్ హీరో నేటి స్టార్ విలన్ జగపతి బాబు స్పందించారు .
ఆయన ఈ రోజు శనివారం హైదరాబాద్ మహానగరంలో జరిగిన రక్తదాన కార్యక్రమంలో పాల్గొన్నారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “నా తొలి సినిమా సింహా స్వప్నం కేవలం మూడు రోజులు మాత్రమే ఆడింది కానీ లెజెండ్ మాత్రం మూడు ఏళ్ళ పాటు ఆడింది .ఈ మూవీకి నాకు నంది అవార్డు రావడం సంతోషంగా ఉంది అని అన్నారు .అయితే నంది అవార్డులపై విమర్శలు వస్తున్నా నేపథ్యంలో మీ కామెంట్ ఏమిటి అని ప్రశ్నించారు విలేఖర్లు .దీనికి సమాధానంగా ఆయన మాట్లాడుతూ అది మీ సమస్య ..నా సమస్య కాదు అని ఆయన అన్నారు .