Home / ANDHRAPRADESH / వైసీపీలోకి టీడీపీ యంగ్ అండ్ డైనమిక్ ఎమ్మెల్యే ..

వైసీపీలోకి టీడీపీ యంగ్ అండ్ డైనమిక్ ఎమ్మెల్యే ..

వినడానికి కొంత ఆశ్చర్యమేసిన ఇదే నిజం .ఇప్పటికే గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలలో ఇరవై రెండు మంది ఎమ్మెల్యేలతో పాటుగా ,ముగ్గురు ఎంపీలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పి అధికార తెలుగుదేశం పార్టీలో చేరిన సంగతి తెల్సిందే .తాజాగా పాడేరు నియోజక వర్గానికి చెందిన వైసీపీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరీ వైసీపీ పార్టీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరారు .ఇలాంటి తరుణంలో కృష్ణాజిల్లా టీడీపీకి చెందిన సీనియర్ నేత ,విజయవాడ రాజకీయాలను తనదైన స్టైల్ లో ప్రభావితం చేయనున్న గన్నవరం టీడీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే వల్లభనేని
వంశీ మోహన్ త్వరలోనే వైసీపీ పార్టీలో చేరతారు అని వార్తలు వస్తున్నాయి .

గత మూడున్నర ఏండ్లుగా జిల్లా టీడీపీ వర్గాల్లో జరుగుతున్న పరిణామాలు ..ఇటివల అసెంబ్లీ సమావేశాల సాక్షిగా తనకు జరిగిన అవమానం ..టీడీపీ అధినేత ,నేతలు తన పట్ల చూపుతున్న వివక్షతకు మానసిక క్షోభకు గురైన వంశీ తనకు సర్కారు కేటాయించిన గన్ మెన్లను కూడా సరెండర్ చేయడానికి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ కు వెళ్ళడం ..ఇలాంటి సంఘటనలను బట్టి ఆయన పార్టీ మారడానికి సుముఖంగా ఉన్నారు .వంశీ పార్టీ మారడానికి ప్రధాన కారణమైన వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని ,వైసీపీ మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ మైత్రి తోడ్పటడంతో వైసీపీలో చేరాలని ఈ యువ ఎమ్మెల్యే నిర్ణయం తీసుకున్నారు అంట .

ప్రస్తుతం కర్నూలు దాటి అనంతపురం జిల్లాలో పాదయాత్ర చేస్తున్న జగన్ విజయవాడకు చేరే సమయానికి వంశీ తన అనుచరవర్గంతో సహా టీడీపీకి చెందిన ఒకరిద్దరు ఎమ్మెల్యేలు ,సీనియర్ నేతలు వైసీపీ కండువా కప్పుకోవడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు .రానున్న ఎన్నికల్లో వైసీపీ గెలవాలని తాపత్రయ పడుతున్న తరుణంలో వంశీ చేరిక ఇప్పటికే నెల్లూరు సంచలనం అనిల్ కుమార్ యాదవ్ ,కడప మిథున్ రెడ్డి ,గుడివాడ కొడాలి నాని ,శ్రీకాంత్ రెడ్డి ,బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ,వైసీపీ మహిళ ఫైర్ బ్రాండ్ ఆర్కే రోజాతో బలంగా ఉన్న వైసీపీ పార్టీకి మంచి బూస్టింగ్ ఇస్తుందని యువనేతలు నాని ,వంగవీటి రాధా చెప్పడంతో జగన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం .దీంతో వంశీ చేరిక ఖాయమని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి .

aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri