ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు వైసీపీ అధినేత. ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర జనసంద్రమవుతోంది. ఊరూవాడా కదలివచ్చి.. జననేతతో పాటు ముందుకు సాగుతున్నారు.ఈ క్రమంలో 27వ రోజు ప్రజాసంకల్పయాత్రలో భాగంగా నేడు గుత్తిలో పాదయాత్ర ప్రారంభించిన జగన్ గుత్తి అనంతపురం, ఆలంపల్లి క్రాస్ గ్రామాల మీదుగా యాత్ర కొనసాగిస్తూ.. మహిళలు, వృద్ధులు, రైతులు, రైతు కూలీలను అప్యాయంగా పలుకరిస్తూ వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గుత్తి శివార్లలో ఓ అభిమాని వైఎస్ జగన్ వద్దకు వచ్చి టీ, బన్ ఇవ్వగా జననేత అప్యాయంగా వాటిని స్వీకరించారు. అభిమానికి ఇచ్చిన టీ తాగుతూ బన్ తింటూ అతడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అధికారంలోకి రాగానే మీ సమస్యలను తీరుస్తానంటూ వారికి వైఎస్ జగన్ భరోసా కల్పించారు.
