Home / ANDHRAPRADESH / రాహుల్ గాంధీ బలహీనతలు ..ఇవే మోదీకి బలం ..

రాహుల్ గాంధీ బలహీనతలు ..ఇవే మోదీకి బలం ..

త్వరలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్న ఆ పార్టీ భావి ప్రధాన మంత్రి అభ్యర్ధి రాహుల్ గాంధీకి రాజకీయం చదరంగంలో కొన్ని బలహీనతలు ఉన్నాయి .అవే ప్రస్తుత ప్రధానమంత్రి ,బీజేపీ సర్కారు రధసారథి నరేంద్ర మోదీకి బలంగా మారుతునున్నాయి .అవి ఏమిటో ఒక లుక్ వేద్దాం ..

రాహుల్ గాంధీ రాజకీయ జీవితాన్ని గమనిస్తే సమయానికి తగ్గట్లు నిర్ణయాలు తీసుకోవడంలో రాహుల్ విఫలమవుతున్నారు .ఉదాహరణకు మధ్యప్రదేశ్ ,ఓడిశా రాష్ట్రాల పీసీసీ అధ్యక్షా పదవులను నియమించడానికి గత ఆరు నెలలుగా సంప్రదింపులు చేస్తున్న కానీ ఇప్పటివరకు ఆ విషయంలో క్లారీటీ లేదు .అంతే కాదు లోక్ సభలో పార్టీ ఉపనేతగా ఉన్న అమరేందర్ సింగ్ రాజీనామా చేసిన కానీ ఉప నేత పదవిని ఇంతవరకు రాహుల్ నియమించలేదు .

రాహుల్ చేస్తోన్న పలు ప్రసంగాలను చూస్తుంటే ఆయన మాటల్లో ఎదుటివార్ని ఆకర్షించే విధంగా ఉండవు .అంతే కాదు సమయానికి తగ్గట్లు ఫంచ్ లు ఉండవు ..విమర్శలు ఉండవు ..సెటైర్లు ఉండవు ..ఆయన పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న ..ఇక్కడ పాలన సరిగా లేని సమయంలో రాహుల్ ఏకంగా సెలవులు పెట్టి మరి ఇతర దేశాల పర్యటనలకు వెళ్తారు .పార్టీ వ్యవహారాల్లో మినహా ప్రభుత్వ సంబంధిత పనుల్లో ఎటువంటి అనుభవం లేదు .ఇవే ప్రధాని మోదీకి బలంగా మారనున్నాయి అని రాజకీయ విశ్లేషకులు
వ్యాఖ్యానిస్తున్నారు ..