ఒక షర్ట్ కొనడానికి వెళ్లినప్పుడు ఆ బ్రాండ్, ఆ మెటీరియల్, క్వాలిటీ, అని వందసార్లు ఆలోచించే మనం, పెళ్లికి వచ్చేసరికి పెళ్లికి వచ్చేసరికి ఎందుకండి అంత అజాగ్రత్తగా ఉంటాం.. ఒక అమ్మాయి లేదా, ప్రొఫైల్ చూసినప్పుడు వారి జీతం ఎంత అని ఆరా తీస్తాం. వారు అసలు ఉన్నారా.? లేరా.? అని ఆరా తీయకుండా అందంగా ఉన్నారని కక్కుర్తి పడతాం. ఇలాంటి అజాగ్రత్తలవల్లే సైబర్ క్రైమ్‌కు గురవుతున్నామని యువ హీరో విజయ్ దేవరకొండ అన్నారు. కాగా, ఇటీవల విజయ్ దేవరకొండతో హైదరాబాద్ సైబర్ క్రైమ్ బ్రాంచ్ చేసిన ఓ షార్ట్‌ఫిల్మ్ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది.
