వైసీపీ పార్టీ ఒక దొంగల పార్టీ ఆ పార్టీకి మద్దతు ఇస్తే రాష్ట్ర ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళతాయని..అందుకే టీడీపీ పార్టీ కేంద్రంపై ప్రత్యేకంగా అవిశ్వాస నోటీసుఇస్తుందని ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నార చంద్రబాబు నాయుడు అన్నారు .ఇవాళ అయన తన పార్టీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ..జగన్ మోహన్ రెడ్డి తో ఒక డ్రామా ,పవన్ కళ్యాణ్ తో మరో డ్రామా ఆడిస్తూ మోడీ సర్కార్ డ్రామాల మీద డ్రామాలాడుతోందన్నారు.అవిశ్వాసం పెట్టు.. రాజీనామాలు చేయించు..నీ ద్వారానే హోదా వచ్చేలా చేస్తామని జగన్ మోహన్ రెడ్డి తో ఒక డ్రామా..అలాగే ఆమరణ దీక్ష చేయి…నీ ద్వారానే హోదా వచ్చేలా చేస్తామని పవన్‌కల్యాణ్‌తో మరో డ్రామా నడిపిస్తున్నారని అన్నారు . వైసీపీ ఇచ్చే నోటీసుపై 5గురు ఎంపీల సంతకాలే ఉంటాయని, అదే టీడీపీ ఇచ్చే నోటీసుపై 16 మంది సంతకాలు ఉంటాయన్నారు.
