ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత,వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇవాళ సాయంత్రం పార్టీ సీనియర్ నేతలు,అధికార ప్రతినిధులతో భేటీ కానున్నారు. జగన్ చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర ప్రస్తుతం కృష్ణాజిల్లాలో కొనసాగుతుంది. పాదయాత్రచేస్తున్న జగన్ ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. ఈ నెల22వ తేదీన జగన్ సంచలన నిర్ణయాలు తీసుకోనున్నారని పార్టీ వర్గాలు ఇప్పటికే వెల్లడించాయి. అయితే ముఖ్యంగా వైసీపీ ఎమ్మెల్యేల రాజీనామాలు, ఎంపీల రాజీనామాల అనంతర పరిణామాలపై చర్చించనున్నట్లు సమాచారం. వైసీపీ ఎంపీలు రాజీనామాలు చేసినా వాటిని ఇంతవరకూ స్పీకర్ సుమిత్రా మహాజన్ ఆమోదించలేదు.అయితే దీనిని ప్రస్తుత అధికార టీడీపీ పార్టీ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా పెద్దయెత్తున ప్రచారం చేస్తోంది. అయితే దీనిని నుంచి బయటపడేందుకు జగన్ వైసీపీ ఎమ్మెల్యేల చేత కూడా రాజీనామా చేయించాలని ఒక నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు.
see also :
బిగ్ బ్రేకింగ్ : జగన్‌ఫై మరో కేసు కొట్టేసిన హైకోర్టు..!!
వైసీపీ పార్టీ ఎమ్మెల్యేలు ఒకవేళ రాజీనామా చేస్తే దానిని ఆమోదించాల్సింది ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల . అయితే రాజీనామాలు ఆమోదించి ముందస్తు ఎన్నికలకు వెళ్లే ధైర్యం ప్రస్తుత పరిస్థితిలో చంద్రబాబుకు లేదని జగన్ మోహన్ రెడ్డి విశ్వసిస్తున్నారు. ఒకవేళ స్పీకర్ ఆమోదించినా ఉప ఎన్నికలకు జగన్ రెడీగా ఉన్నారంటున్నారు.ఏపీ కి ప్రత్యేక హోదా సెంటిమెంట్ తో రాజీనామాలు చేసి ఎన్నికలు వెళితే ప్రజలు తప్పక ఆదరిస్తారన్న ధీమాలో వైసీపీ నేతలు ఉన్నారు.అయితే ఈ భేటీలో వీటితో పాటు తాజాగా జరుగుతున్న రాజకీయ పరిణామాలపై కూడా చర్చించనున్నారు.సమావేశంలోనే భవిష్యత్ కార్యాచరణను జగన్ ప్రకటించనున్నట్లు పార్టీ నేత ఒకరు తెలిపారు.
see also :