తెలంగాణ రాష్ట్రావతరణ దినోత్సవ వేడుకలకు మరి కొన్ని గంటలుండగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు తీపి కబురును అందించింది .ఈ నేపథ్యంలో భారీ స్థాయిలో మొత్తం పద్దెనిమిది వేల పోలీస్ ఉద్యోగాల భర్తీకి పోలీస్ ఉద్యోగ నియామక సంస్థ నోటిఫిషన్ విడుదల చేసింది .ఈ క్రమంలో వాటి వివరాలు ఇలా ఉన్నాయి..
వివిధ విభాగాల్లో మొత్తం 18,428 పోస్టులు భర్తీ..
జూన్ 9 నుంచి 30వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరణ ..
నోటిఫికేషన్లు జారీ చేసిన పోలీసు నియామక సంస్థ ..
పోస్టుల వివరాలు ..
కానిస్టేబుళ్లు- 16,767,
ఎస్‌ఐ-739,
ఏఎస్‌ఐ-26,
ఆర్‌ఎస్‌ఐ- 471,
వార్డర్లు- 221,
ఫైర్‌మెన్- 168,
స్టేషన్ ఫైర్ ఆఫీసర్- 19,
డిప్యూటీ జైలర్-15,
అసిస్టెంట్ మ్యాట్రన్-2 .
